రెండవ రోజూ ఎన్జీవోల సమ్మె
మూత పడిన ప్రభుత్వ కార్యాలయాలు
గుంటూరుసిటీ, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన బిల్లుపై కేంద్రం తీసుకుంటున్న చర్యలను నిరసిస్తూ జిల్లా ఎన్జీవోలు చేపట్టిన సమ్మె రెండవ రోజు శుక్రవారం కూడా కొనసాగింది. కలెక్టర్ కార్యాలయం, జిల్లాపరిషత్ కార్యాలయం, మెప్మా, గృహనిర్మాణ, సాంఘిక సంక్షేమ కార్యాలయాలను ఉద్యోగులు మూసి వేయించారు. అన్ని ప్రభుత్వ విభాగ కార్యాలయాలకు వెళ్లి సమ్మెకు మద్దతు తెలపాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్జీవో సంఘం అధ్యక్షుడు రామిరెడ్డి మాట్లాడుతూ సీమాంద్ర నాయకులందరూ పార్టీల కతీతంగా రాష్ట్ర విభజన బిల్లును వ్యతిరేకించాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం కేవలం రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్రాన్ని విడదీయటానికి సిద్ధ పడుతుందన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో ఎన్జీవో నగర అధ్యక్షుడు దయానందరాజు, రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు పెరికల చినవెంకయ్య, అన్ని ప్రభుత్వ విభాగాల కార్యాలయాల నుంచి ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
స్తంభించిన సేవలు
Published Sat, Feb 8 2014 1:58 AM | Last Updated on Wed, Oct 17 2018 5:10 PM
Advertisement
Advertisement