హైదరాబాద్: ఏపీ ఎన్జీవోలతో ప్రభుత్వం చర్చలకు సిద్ధమైంది. ఏపీఎన్జీవోలతో నిరవధిక సమ్మెకు దిగిన నేపథ్యంలో ప్రభుత్వం వారితో చర్చలు జరుపుతోంది. ఈ చర్చల్లో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతో సహా మంత్రులు ఆనం రాం నారాయణ రెడ్డి, పితాని సత్యనారాయణలు పాల్గొన్నారు. ఉద్యోగులు వెంటనే సమ్మె విరమించుకుని విధులకు హాజరు కావాలని వారు విజ్ఞప్తి చేశారు.
శాంతియుత పద్ధతిలో ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభింపచేయటం ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాబోతున్నాం’’ అని ఏపీ ఎన్జీవోల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు పేర్కొన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సోమవారం అర్ధరాత్రి నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్‌టీసీ సిబ్బంది, సహకార సంస్థల సిబ్బంది సమ్మె చేయనున్నట్లు ఆయన స్పష్టంచేశారు. 1986 తర్వాత ప్రభుత్వ వ్యవస్థ మొత్తం సమ్మెలోకి వెళ్లటం ఇదే ప్రథమమని ఆయన శనివారం విజయవాడలో విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విభజించిన తీరు తమను బాధించిందని వారు తెలిపిన సంగతి తెలిసిందే.