
ఎమ్మెల్సీ కోటాపై ఏపీ ప్రభుత్వానికి గవర్నర్ లేఖ
హైదరాబాద్ : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అంశంపై ఏపీ ప్రభుత్వానికి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఓ లేఖ పంపారు. గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీల నియామకం నేపథ్యంలో శుక్రవారం గవర్నర్ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. గవర్నర్ లేఖపై ఏపీ ప్రభుత్వం త్వరగానే స్పందించింది. గవర్నర్ లేఖకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.