
మాకు మొండివైఖరి లేదు: మంత్రి శిద్దా
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధమని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు మొండివైఖరి విడనాడి సమ్మె విరమించాలని ఆయన కోరారు. ఆర్టీసీ ఎండీ సాంబశిరావుతో కలిసి సచివాలయంలో శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఆర్టీసీ కార్మికులు చర్చలకు వస్తే స్వాగతిస్తామని, తమకు మొండి వైఖరి లేదన్నారు. ఏపీ ఎంసెట్ విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఎంసెట్ కు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. శనివారం 60 శాతం బస్సులు నడుపుతామని మంత్రి చెప్పారు.