ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే 64 లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడతారని ఏపీ రవాణా మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు.
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే 64 లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడతారని ఏపీ రవాణా మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. కార్మికుల డిమాండ్లపై చర్చించేందుకు ప్రభుత్వం కార్యవర్గ ఉపసంఘం ఏర్పాటు చేసిందని చెప్పారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయంలో సమ్మె చేయడం తగదని అన్నారు.
43 శాతం ఫిట్ మెంట్ ఇస్తే ఏడాదికి రూ.930 కోట్ల భారం పడుతుందని తెలిపారు. 15 శాతం ఆర్టీసీ చార్జీలు పెంచాలని సీఎంకు ప్రతిపాదనలు పంపామని, ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. కాగా ఆర్టీసీ యాజమాన్యంతో చర్చలు విఫలం అవడంతో కార్మిక సంఘాలు సమ్మెకు సిద్ధమవుతున్నాయి.