సాక్షి, కర్నూలు: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షు డు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వే డుకలను ఆదివారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తల హడావుడి పండు గ వాతావరణాన్ని తలపించింది. కేకు లు కట్ చేసి సందడి చేశారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి వెలుగోడు పార్టీ కార్యాలయంలో వికలాంగురాలితో కేక్ కట్ చేయించా రు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.
కర్నూలులోని పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ గ్రీవెన్స్ సెల్ జిల్లా కన్వీనర్ తెర్నెకల్ సురేందర్ రెడ్డి, పులకుర్తి రాజారెడ్డి, తదితరులు భారీ కేక్‌ను కట్ చేసి జన్మదిన వేడుకలను ఘ నంగా నిర్వహించారు. ఆళ్లగడ్డ నియోజ కవర్గం చాగలమర్రి మండలంలోని నగళ్లపాడు సమీపంలో మార్తోమా అనాథాశ్రమంలో వృద్ధులు, వికలాంగులకు వైఎస్‌ఆర్‌సీపీ నేత నాగరాజు ఆధ్వర్యం లో భూమా యూత్ సభ్యులు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. ఆలూరు, ఆస్ప రి మండలాల కన్వీనర్లు, పార్టీ నేతలు స్థానిక ప్రభుత్వ ఎస్‌పీహెచ్‌ఓ ఆసుపత్రి లో రోగులకు, బాలింతలకు పండ్లు పం చిపెట్టారు. ఆత్మకూరులో సీనియర్ నా యకుడు తిమ్మయ్య యాదవ్ ఆధ్వర్యం లో అభిమానులు భారీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బాణసం చా పేల్చారు. మంత్రాలయం మండ లం తుంగభద్ర గ్రామంలోని జ్యోతి ఆ శ్రమంలో వైఎసార్‌సీపీ రాష్ట్ర యూత్ క మిటీ సభ్యుడు వై.ప్రదీప్‌రెడ్డి ఆధ్వర్యం లో విద్యార్థులకు 40 దుప్పట్లు పంపిణీ చేశారు. పత్తికొండలో పార్టీ నేత పోచిమిరెడ్డి మురళీధర్‌రెడ్డి కుమార్తె జాహ్నవి చేతుల మీదుగా కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థులకు నాలుగు వాలీబాళ్లతో పాటు నెట్‌ను అందజేశారు.
జగన్ జన్మదిన వేడుక
Published Mon, Dec 22 2014 3:57 AM | Last Updated on Fri, Mar 22 2019 6:18 PM
Advertisement
Advertisement