ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. అనంతపురంలోని పార్టీ కార్యాలయం వద్ద రక్తదాన శిబిరాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ ప్రారంభించారు. పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఆస్పత్రులకు వెళ్లి రోగులకు పండ్లు, బ్రెడ్డు అందజేశారు.
అనంతపురం అర్బన్ : స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆదివారం పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం శంకరనారాయణ అధ్యక్షతను ఘనంగా నిర్వహించారు. ఉదయం 9.45 నిమిషాలకు భారీ కేక్‌ను కట్ చేసి వేడుకలను నిర్వహించారు. వైఎస్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ప్రజాసమస్యల పరిష్కారానికి పాటుపడుతూ పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు నేతలు సూచించారు.
కార్యక్రమంలో క్రమశిక్ష ణ సభ్యులు బీ ఎర్రిస్వామిరెడ్డి, ఏడీసీసీ బ్యాంకు అధ్యక్షుడు లింగాల శివశంకర్‌రెడ్డి, సీనియర్ నాయకులు చవ్వా రాజశేఖర్‌రెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి (చందు), అనంతచంద్రారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యద ర్శులు నదీమ్ అహమ్మద్, మీసాల రంగన్న, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి గవళ్ళ శ్రీకాంత్‌రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎం నరేంద్రరెడ్డి, ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలే జయరాం నాయక్, మైనార్టీ రాష్ట్ర నాయకులు ఖాదర్ భాషా, కె. జిలాన్ బాషా, ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కే హుస్సేన్ పీరా, జిల్లా యువజన అధ్యక్షుడు ధనుంజయ యాదవ్, ప్రధాన కార్యదర్శులు మహానందరెడ్డి, విద్యా సాగర్‌రెడ్డి, నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, యువజన అధ్యక్షుడు ఎల్లుట్ల మారుతి నాయుడు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండి పరుశురామ్, ప్రధాన కార్యదర్శులు ఎద్దుల అనిల్‌కుమార్, మారుతి ప్రకాష్, ఆవుల రాఘవేంద్రరెడ్డి, మహిళ జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ , కార్యదర్శి కృష్ణవేణి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు కె. వెంకట చౌదరి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబలేశు, ఎస్‌టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సాకే రామకృష్ణ, ప్రధాన కార్యదర్శులు ముక్తియార్, లీగల్ సెల్ అధ్యక్షుడు బీ నారాయణరెడ్డి, వైఎస్సార్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు మిద్దా భాస్కరరెడ్డి, జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు మరవపల్లి ఆదినారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శులు ఆలూరు సాంబశివారెడ్డి, బోయ తిరుపాలు, డాక్టర్ మైనుద్దీన్, జిల్లా కార్యదర్శి నార్పల రఘునాథ్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శులు గౌస్‌మొహిద్దీన్, ముని శంకరయ్య, అధికార ప్రతినిధులు చింతకుంట మధు, ఆలమూరు శ్రీనివాస్‌రెడ్డి, పోరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, రమేష్, స్టీరింగ్ కమిటీ సభ్యుడు పాల్యం రంగస్వామి, దిలీప్‌రెడ్డి, జెయం బాషా, సర్పంచ్ లోకనాథ్‌రెడ్డి, కెప్టన్ షేక్షా, నిమ్మల నాగరాజు, జంగాలపల్లి రఫీ, సాకే ఆదినారాయణ,మహిళ నాయకురాళ్ళు లక్ష్మిశ్రీనివాస్, ఆచారమ్మ, సరోజమ్మ, జానకి, తమీమ్, షమీ, షాహజ్, హైజారబీ, మునీరా, బరాలి, పార్టీ నాయకులు, కార్యకర్తలు అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో....
నగరంలోని కొవ్వూరు నగర్‌లో ఉన్న వికలాంగుల బాలికల వసతి గృహంలో వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా విద్యార్థినులకు నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండి పరుశురాం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం. శంకర్‌నారాయణ, పార్టీ క్రమశిక్షణ సభ్యుడు బి. ఎర్రిస్వామిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ కోసం నిత్యం పోరాటాలు చేస్తున్న వైఎస్ జగన్ ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు.
సేవాదళ్, ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం..
జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు మిద్దె భాస్కర్‌రెడ్డి, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మరవపల్లి ఆదినారాయణరెడ్డి, అనుబంధ సంఘాల ఆ ధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు ఎం. శంకర్‌నారాయణ, సీనియర్ నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి ప్రారంభించారు. లారీ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.
అంధుల ఆశ్రమంలో...
కురుకుంట గ్రామంలో ఉన్న అంధుల ఆశ్రమంలో వైస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎల్‌ఎం. మోహన్‌రెడ్డి, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి బాల నరసింహరెడ్డి, ఆధ్వర్యంలో ఆశ్రమంలోని అంధులకు పండ్లు, పాలు, బ్రెడ్లు అందజేశారు. అనంతరం కేక్ కట్ చేసి పంచిపెట్టారు.
జగన్ ఆశయసాధనకు కృషి
యూనివర్సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆశయసాధనకు తోడ్పడదామని విద్యార్థి నేతలు అన్నారు. ఎస్కేయూ పరిధిలోని అమ్మఒడి వృద్ధాశ్రమంలో ఆదివారం వైఎస్ జగన్ జన్మదినాన్ని పురస్కరించుకొని వేడుకలను ఘనంగా నిర్వహించారు. వృద్ధులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. వెఎస్సార్ విద్యార్థి విభాగం ఎస్కే యూ అధ్యక్షుడు గెలివి నారాయణరెడ్డి, జి. రవి, సోమేష్‌కుమార్, గోవిందు, చంద్రమోహన్, ఉపేంద్రరెడ్డి, జనార్ధన రెడ్డి, విజయ్, వెంకటేశ్వరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు, పాల్గొన్నారు. జిల్లా కేం ద్రంలో జిల్లా అధ్యక్షుడు ఎం. శంకర్‌నారాయణ అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వికలాంగుల విద్యార్థులకు పుస్తకాలు, పె న్నులు పంపిణీ చేశారు. సేవాదళళ్, ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యం లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రాయదుర్గం, హిందూపు రం, గుంతకల్లు నియోజకవార్గల సమన్వయకర్తలు కాపు రామచంద్రారెడ్డి, నవీన్‌నిశ్చల్, వై. వెంకటరామిరెడ్డి, ఆధ్వర్యంలో వే డుకలు నిర్వహించారు. ఆస్పత్రిలో రోగులకు పండ్లు, పాలు, పం పిణీ చేశారు. తాడిపత్రి నియోజకవర్గ అదనపు సమన్వయకర్త రమేష్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి విఆర్ వెంకటేశ్వరరెడ్డిలు జగన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఉరవకొండ నియోజకవర్గంలో జెడ్పీటీసీలు తిప్పయ్య, లలితమ్మ, పెనుకొండ నియోజకవర్గంలో మండల కన్వీనర్ వెంకటరామిరెడ్డి, ఎంపీటీసీలు రాంమోహన్‌రెడ్డి వేడుకలు నిర్వహించారు. కదిరి నియోజకవర్గంలో పార్టీ సీఈసీ డాక్టర్ సిద్దారెడ్డి, మాజీ మంత్రి మహమ్మద్ షాకీర్, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ఫర్హానా, ఇతర ఆ పార్టీ నాయకులు అత్తార్ రెసిడెన్సీలో కేక్ కట్ చేసి పంచిపెట్టారు. కౌన్సిలర్లు ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంచిపెట్టారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం తిమ్మాపురంలో, మ డకశిర నియోజకవర్గంలో రొళ్ల మండలంలో, శింగనమల నియోజకవర్గంలో గార్లదిన్నె మండలంలో మార్కెట్ యార్డు చైర్మన్ నారాయణరెడ్డి, మండల కన్వీనర్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వే డుకలు సాగాయి. ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ బత్తల పల్లి మండలాల్లో నిర్వహించిన వేడకల్లో కౌన్సిలర్ చందమూరు నారాయణరెడ్డి, అధికార ప్రతినిధి కేశవరెడ్డి, పాల్గొన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో తాలమర్ల సంజీవరెడ్డి ఆధ్వర్యంలో జగన్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్రభాస్కర్‌రెడ్డి వృద్దుల కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం కంటి వైద్యశిబిరాన్ని నిర్వహించారు. విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి సీ.సోమశేఖర్‌రెడ్డి కదిరి ప్రభుత్వ ఎస్టీ బాలికల వసతి గృహంలో చిన్నారులతో కేక్ కట్ చేయించారు.