సాయంత్రం 4.57కు నింగిలోకి
సూళ్లూరుపేట: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లో రెండో ప్రయోగ వేదిక నుంచి మే 5వ తేదీ సాయంత్రం 4.57 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్–09 ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు ఇస్రో బుధవారం ప్రకటించింది. ప్రయోగానికి సంబంధించి మంగళవారం రాకెట్ శిఖర భాగంలో 2,330 కిలోల బరువు కలిగిన జీశాట్–9 సమాచార ఉపగ్రహాన్ని అనుసంధానం చేసే ప్రక్రియను పూర్తి చేశారు. బుధవారం ఫేస్–3, లెవెల్–3 తనిఖీలను నిర్వహించారు.
శుక్రవారం వరకు వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్ (వ్యాబ్)లోని రాకెట్‌కు అన్ని తనిఖీలు పూర్తి చేసి ఈనెల 29న ఉద యం 6 నుంచి 8 గంటల్లోపు వ్యాబ్ నుంచి సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న హుంబ్లీకల్ టవర్‌కు అనుసంధానం చేస్తా రు. ప్రయోగ సమయానికి 22 గంటల ముందు మే 4న సాయంత్రం 6.57 కు కౌంట్‌డౌన్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఉపగ్రహం సుమారు12 ఏళ్ల పాటు సేవలను అందిస్తుంది.
మే 5న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్–09 ప్రయోగం
Published Thu, Apr 27 2017 1:51 AM | Last Updated on Tue, Sep 5 2017 9:46 AM
Advertisement