GSLV-F09
-
దక్షిణాసియాకిది చరిత్రాత్మక దినం: మోదీ
-
నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ ఎఫ్09
-
నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ ఎఫ్09
శ్రీహరికోట : జీఎస్ఎల్వీ ఎఫ్09 ఉపగ్రహ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి శుక్రవారం సాయంత్రం 4.57 నిమిషాలకు జీఎస్ఎల్వీ ఎఫ్09 ఉపగ్రహ వాహక నౌకను ప్రయోగించారు. దీనికి సంబంధించి గురువారం మధ్యాహ్నం 12.57 నిమిషాలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ప్రయోగాన్ని 20మంది సభ్యులతో కూడిన పార్లమెంటరీ కమిటీ షార్ నుంచి ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. మరోవైపు ఈ కార్యక్రమానికి మీడియాను దూరంగా ఉంచారు. కాగా ఈ రాకెట్ ద్వారా 2,230 కిలోల బరువు కలిగిన విశాట్–9(దక్షిణాసియా దేశాల శాటిలైట్) ఉపగ్రహాన్ని భూమికి 36వేల కి.మీ ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఉపగ్రహంలో 12 కేయూ బ్రాండ్ ట్రాన్స్ఫార్మర్స్ను అమర్చారు. దక్షిణాసియా దేశాలైన శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, భారత్, మాల్దీవులు దేశాలకు ఈ ఉపగ్రహం 12 ఏళ్లపాటు సేవలందించనుంది. జీఎస్ఎల్వీ ప్రయోగాల్లో ఇది 11వ ప్రయోగం కావడం విశేషం. ఇప్పటివరకు నిర్వహిం చిన 10 ప్రయోగాల్లో 3 విఫలం కాగా 7 విజయవం తమయ్యాయి. జీఎస్ఎల్వీ ప్రయోగాల్లో ఎంతో సంక్లిష్టమైన క్రయోజనిక్ దశను స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. కాగా షార్ శాస్త్రవేత్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. -
మే 5న జీఎస్ఎల్వీ ఎఫ్–09 ప్రయోగం
-
మే 5న జీఎస్ఎల్వీ ఎఫ్–09 ప్రయోగం
సాయంత్రం 4.57కు నింగిలోకి సూళ్లూరుపేట: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లో రెండో ప్రయోగ వేదిక నుంచి మే 5వ తేదీ సాయంత్రం 4.57 గంటలకు జీఎస్ఎల్వీ ఎఫ్–09 ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు ఇస్రో బుధవారం ప్రకటించింది. ప్రయోగానికి సంబంధించి మంగళవారం రాకెట్ శిఖర భాగంలో 2,330 కిలోల బరువు కలిగిన జీశాట్–9 సమాచార ఉపగ్రహాన్ని అనుసంధానం చేసే ప్రక్రియను పూర్తి చేశారు. బుధవారం ఫేస్–3, లెవెల్–3 తనిఖీలను నిర్వహించారు. శుక్రవారం వరకు వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్ (వ్యాబ్)లోని రాకెట్‌కు అన్ని తనిఖీలు పూర్తి చేసి ఈనెల 29న ఉద యం 6 నుంచి 8 గంటల్లోపు వ్యాబ్ నుంచి సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న హుంబ్లీకల్ టవర్‌కు అనుసంధానం చేస్తా రు. ప్రయోగ సమయానికి 22 గంటల ముందు మే 4న సాయంత్రం 6.57 కు కౌంట్‌డౌన్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఉపగ్రహం సుమారు12 ఏళ్ల పాటు సేవలను అందిస్తుంది. -
మార్చి 31న జీఎస్ఎల్వీ ఎఫ్ 09 ప్రయోగం
శ్రీహరికోట(సూళ్లూరుపేట): సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి మార్చి 31న జీఎస్ఎల్వీ ఎప్–09, ఏప్రిల్‌లో జీఎస్ఎల్వీ మార్క్–3, అదే నెలలోనే పీఎస్ఎల్వీ సీ38 ప్రయోగాలను నిర్వహించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్దమవుతున్నారు. ఈనెల 15న ఫ్రయోగించిన 104 ఉపగ్రహాల ప్రయోగంతో మంచి జోష్ మీదున్న ఇస్రో శాస్త్రవేత్తలు ఏకకాలంలో మూడు రాకెట్ల అనుసంధానం పనులు చేస్తున్నారు. రెండవ ప్రయోగవేదికకు సంబంధించిన వెహికల్ అసెంబ్లింగ్ భవనం (వీఏబీ)లో జీఎస్ఎల్వీ ఎఫ్09 అనుసంధానం పనులు జరుగుతున్నాయి. అదే విధంగా సాలిడ్ స్టేజీ అసెంబ్లింగ్ బిల్డింగ్ (ఎస్‌ఎస్‌ఏబీ)లో జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ అనుసంధానం పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఎస్–200, ఎల్–110, సీ–25 అనే మూడుదశలకు భూస్థిర పరీక్షలు నిర్వహించి విజయవంతమయ్యాక ఆ దశలను అనుసంధానం చేస్తున్నారు. జీఎస్ఎల్వీ ఎప్–09 రాకెట్ ద్వారా 2 టన్నుల బరువైన జీశాట్–9, జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ ద్వారా నాలుగు టన్నుల బరువు కలిగిన జీశాట్–19 అనే సమాచార ఉపగ్రహాలను రోదసీలోకి పంపించేందుకు సన్నాహాలు ముమ్మరంగా చేస్తున్నారు. మొదటి ఫ్రయోగ వేదికపై మరో వారం రోజుల్లో పీఎస్ఎల్వీ సీ38 పనులు ప్రారంభించేందుకు కూడా సిద్దమవుతున్నారు. ఇందులో దూరపరిశీలనా ఉపగ్రహంతో పాటు వాణిజ్యపరమైన ఉపగ్రహాలుండే అవకాశం వుంది. ఒకే రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలను ఏకకాలంలో ప్రయోగించి చరిత్ర సృష్టించి ఇప్పుడు మార్చి, ఏప్రిల్ నెలల్లోనే ఈ మూడు ఫ్రయోగాలను చేసి మరో రికార్డును సృష్టించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు, ఉద్యోగులు కృషి చేస్తున్నారు.