తెలంగాణ సర్వేకు గుజరాత్ సీఎం చేయూత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈనెల 19న నిర్వహించబోతున్న సమగ్ర సర్వేను దృష్టిలో ఉంచుకుని గుజరాత్‌లోని తెలంగాణవారు స్వస్థలాలకు చేరుకునేలా అక్కడి రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సూరత్, అహ్మదాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ వారికోసం ప్రత్యేక రైళ్లు, బస్సులను నడుపుతోంది. తెలంగాణ బీజేపీ నేతల చొరవతో గుజరాత్ ప్రభుత్వం స్పందించటం విశేషం.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మూడురోజుల క్రితం గుజరాత్ సీఎం ఆనందీబెన్‌పటేల్‌తో మాట్లాడి పూర్తి వివరాలతో లేఖ కూడా రాశారు. దీంతో గుజరాత్ రవాణాశాఖ మంత్రి తెలంగాణ బీజేపీ నేతలతో చర్చించి రవాణా సదుపాయాలపై నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 18న అక్కడి తెలంగాణ వారు స్వస్థలాలకు చేరుకునేలా ప్రత్యేక రైళ్లు, బస్సులను సిద్ధం చేశారు.