సురేష్ బాబు
అతను ఓ విశ్రాంత పోలీస్ అధికారి. కుమారుడికి మగ సంతానం లేకపోవడంతో రెండో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. కొడుకు ఒప్పుకోకపోవడంతో ఓ యువతి అద్దెగర్భంతో తానే ఓ కుమారుడిని కన్నాడు. ఇప్పుడు అతనే తన వారసుడని తేల్చిచెబుతున్నాడు. మొదటి కొడుకుని తన బిడ్డే కాదంటున్నాడు. భార్యాబిడ్డలను వదిలేసి తన వద్దకు వస్తేనే ఆస్తిలో వాటా ఇస్తానని చెబుతున్నాడు. తండ్రి తీరుతో మనస్తాపం చెందిన కుమారుడు న్యాయం కోసం ‘స్పందన’ లో ఎస్పీ విజయారావుకు ఫిర్యాదు చేశారు.
సాక్షి, గుంటూరు: నా తండ్రి సుబ్బారావు ఏఆర్ ఎస్‌ఐగా పనిచేసి 2013లో రిటైర్ అయ్యాడు. నాకు 2000 వ సంవత్సరంలో వివాహమై ఒక కుమార్తె జన్మించింది. అప్పటి నుంచి వారసులు లేరనే సాకుతో మా నాన్న నన్ను రెండో పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడు. నేను అంగీకరించకపోవడంతో నాపై కక్ష గట్టి, రెండేళ్ల క్రితం శ్రీకాకుళంకు చెందిన యువతిని తీసుకువచ్చి అద్దె గర్భం ద్వారా ఓ కొడుకును కన్నాడు. ఇప్పుడు నన్ను వారి కొడుకునే కాదని అంటున్నాడు. మా తాత ద్వారా వచ్చిన ఆస్తిని కూడా నాకు దక్కకుండా చేయాలని చూస్తున్నాడు. నాభార్య, పిల్లను వదిలేసి వస్తే ఆస్తి ఇస్తానంటున్నాడు. లేకుంటే అక్రమ కేసులు పెడతానని బెదిరిస్తున్నాడు. విచారించి న్యాయం చేయాలి
Comments
Please login to add a commentAdd a comment