'శుంఠ' బూతు మాట కాదు
నల్గొండ : కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి సమర్థించారు. 'సీమాంధ్రలో శుంఠలు పుట్టారు' అంటూ రెండు రోజుల క్రితం జైపాల్ రెడ్డి తెలంగాణ తహసీల్దార్ల డైరీ ఆవిష్కరణ సందర్భంగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. శుంఠ అంటే బూతు మాట కాదని ....గుత్తా సుఖేందర్ రెడ్డి సోమవారం వివరణ ఇచ్చారు. దీనిపై సీమాంధ్ర నేతలు రాద్ధాంతం చేయటం తగదని ఆయన హితవు పలికారు.
భోగిమంటల్లో తెలంగాణ బిల్లు ప్రతులను దహనం చేయటాన్ని గుత్తా ఆక్షేపించారు. ప్రతుల దగ్ధం తెలంగాణ ప్రజలను అవమానించటమేనని ఆయన అన్నారు. ఇటువంటి అనైతిక చర్యలు మానుకోకపోతే చర్యలు తప్పవని గుత్తా హెచ్చరించారు. తెలంగాణ ప్రతులను భోగి మంటల్లో కాల్చడం... వాళ్ల సంస్కారహీనతకు నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో నల్గొండ ఎంపీ గానే పోటీ చేస్తానని గుత్తా స్పష్టం చేశారు.