బుక్కరాయసముద్రం : అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల పరిధిలోని భద్రంపల్లి గ్రామంలో అప్పులభాధతో శనివారం ఓ చేనేత కార్మికుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల ప్రకారం.. యల్లనూరు మండలం గొడ్డుమర్రికి చెందిన రమేష్(26) అనే వ్యక్తి ధర్మవరంలో చేనేత కార్మికుడిగా కూలి పనులు చేసుకుంటూ భార్యతో కలిసి జీవిస్తూ ఉండేవాడు.
చీరలు నేస్తే 2 వేలు కూలీ ఇచ్చేవారు. ఈ నేపథ్యంలో కుటుంబ పోషణకు రూ.2 లక్షల వరకు అప్పులు చేశాడు. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక కుటుంబ పోషణ భారమవడంతో మనస్తాపం చెందిన రమేష్ శనివారం తెల్లవారుజామున ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏఎస్‌ఐ జనార్దన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.