సచివాలయం సాక్షిగా భూదందా: హరీష్ రావు | Harish Rao says secretariat involved in Land scam | Sakshi
Sakshi News home page

సచివాలయం సాక్షిగా భూదందా: హరీష్ రావు

Published Sat, Nov 23 2013 4:47 PM | Last Updated on Sat, Sep 2 2017 12:54 AM

సచివాలయం సాక్షిగా భూదందా: హరీష్ రావు

సచివాలయం సాక్షిగా భూదందా: హరీష్ రావు

సచివాలయం సాక్షిగా రాష్ట్రంలో భూదందా జరుగుతోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి, రెవెన్యూ మంత్రి రఘువీరా రెడ్డిలు వాటికి కేంద్రంగా మారుతున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజనను అడ్డుకుంటామంటూ దోపిడీ చేస్తున్నారని హరీష్ రావు వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం కౌలుదారుల పేరిట ప్రైవేట్ వ్యక్తులకు భూములను అప్పగిస్తోందని, ఈ మొత్తం వ్యవహారంపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. భూదోపిడికి సీఎం కార్యాలయం నుంచే అధికారులకు ఆదేశాలు పంపుతున్నారని, భూదందాలకు సచివాలయం కేంద్రంగా మారిందని హరీశ్‌రావు ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement