
భారీగా పెరిగిన మద్యం ఆదాయం
అక్టోబర్‌లో రూ.556 కోట్ల రాబడి
హైదరాబాద్: అక్టోబర్‌లో మద్యం ద్వారా ప్రభుత్వ ఖజానాకు పెద్దమొత్తంలో ఆదాయం సమకూరింది. ఏకంగా రూ.556 కోట్ల ఆదాయం లభించింది. సెప్టెంబర్‌లో ఎక్సైజ్ విభాగ ఆదా యం సుమారు రూ.250 కోట్లే కావడం గమనా ర్హం. వ్యాట్, స్టాంపులు-రిజస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం తగ్గింది. రాష్ట్రం విడిపోయిన తరువాత జూలై నుంచి సెప్టెంబర్ వరకు వచ్చిన వ్యాట్ ఆదాయం చూస్తే ప్రతి నెలా రూ.2,000 కోట్లకు మించే ఆదాయం వచ్చింది. అక్టోబర్ నెలలో రూ.1,894 కోట్లే వచ్చిందని అధికార వర్గాలు వివరించాయి.
అలాగే స్టాంపులు రిజస్ట్రేషన్లతో జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఏ నెల చూసినా రూ.250 కోట్లకు పైగానే ఆదాయం వచ్చింది. అక్టోబర్ నెలలో మాత్రం సుమారు రూ.125 కోట్లకు పడిపోయింది. రవాణా రంగం ద్వారా వచ్చే ఆదాయం గత రెండు నెలలతో పోల్చి చూస్తే అక్టోబర్ నెలలో పెరిగింది. ఈ నెలలో రూ.168 కోట్ల రాబడి వచ్చింది.