మచిలీపట్నం, న్యూస్‌లైన్ : బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో గురువారం వర్షాలు కురిశాయి. ఈ వర్షాల ప్రభావంతో పంటలకు మేలు జరుగుతుందని రైతులు చెబుతున్నారు. జిల్లాలో అత్యధికంగా ఇబ్రహీంపట్నం మండలంలో 92.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా గుడ్లవల్లేరు మండలంలో 0.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 16.6 మిల్లీమీటర్లుగా నమోదైంది.
వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం వివరాలిలా ఉన్నాయి. చందర్లపాడు 2.4, జి.కొండూరు 5.6, విజయవాడ రూరల్, అర్బన్ ప్రాంతాల్లో 19.2 వర్షపాతం నమోదైంది. పెనమలూరులో 24.2 , తోట్లవల్లూరులో 16.8, కంకిపాడులో 12.0, గన్నవరంలో 2.2 నమోదైంది.
బాపులపాడు 3.2 , ఉంగుటూరు 0.8, ఉయ్యూరు 18.0, పమిడిముక్కల 10.2, మొవ్వ 11.4, ఘంటసాల 15.4, చల్లపల్లి 76.0, మోపిదేవి 45.8, అవనిగడ్డ 41.6, నాగాయలంక 15.2, కోడూరు 19.4, మచిలీపట్నం 40.6, గూడూరులో 6.8, పామర్రు 59.0, పెదపారుపూడి 33.0, నందివాడ 17.4, గుడివాడ 45.8, బంటుమిల్లి 5.2, ముదినేపల్లి 29.6, మండవల్లి 30.8, కలిదిండి 80.4, కైకలూరు 31.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
విస్తారంగా వర్షాలు
Published Fri, Sep 13 2013 3:16 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement