
కుండపోత
లోతట్టు ప్రాంతాలు జలమయం
పంటలకు మేలు
బుధవారం కుండపోతగా కురిసిన వర్షానికి జిల్లా తడిసి ముద్దయింది. 28 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. చినుకు కోసం ఎదురు చూస్తున్న రైతులను సైతం చిత్తడి చేసేలా కురిసింది. పగుళ్లు తీసిన పంట భూములకు కరువు తీరింది.
అల్పపీడన ప్రభావంతో గడిచిన రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు పంటలకు మేలు చేయగా..లోతట్టు ప్రాంతాలన్నీ ముంపునకు గురయ్యాయి.