ఫైల్ ఫోటో
తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి భక్తులకు 18 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిర్వాహకులు వెల్లడించారు. వారాంతం కావడం వలన తిరుమలలో భక్తుల రద్దీ పెరిగి అధికారులు వెల్లడించారు.
శ్రీవారి దర్శనం కోసం 24 కంపార్ట్‌మెంట్లలో ఉన్న భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు, ప్రత్యేక ప్రవేశదర్శనానికి 7 గంటలు, కాలినడక భక్తులకు 14 గంటల సమయం పడుతోందని నిర్వాహకులు తెలిపారు.