తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. వరుస సెలవుల నేపథ్యంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు.
తిరుమల : తిరుమల కొండ శనివారం కూడా భక్తులతో కిటకిటలాడుతోంది. వరుస సెలవుల నేపథ్యంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. దాంతో వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. స్వామివారి సర్వ దర్శనానికి 36గంటలు, కాలి నడక భక్తులకు 20 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. రద్దీ అధికంగా ఉండటంతో టీటీడీ అధికారులు రెండు రోజుల పాటు వీఐపీ దర్శనాన్ని రద్దు చేశారు. మరోవైపు పెళ్లిళ్లు సందర్భంగా తిరుమలకు భక్తుల తాకిడి అధికమైంది.