హెరిటేజ్ పెరుగు ప్యాకెట్‌లో వచ్చిన నాచు లాంటి పదార్థం
విజయనగరం మున్సిపాలిటీ : పాలు, పెరుగు విక్రయించే హెరిటేజ్ సంస్థకు చెందిన ఉత్పత్తుల్లో నాణ్యతా లోపం వెలుగులోకి వచ్చింది. ఈ సంస్థ తయారుచేసి డీలర్ల ద్వారా విక్రయిస్తున్న పాలు, పెరుగులో నాణ్యత లేకపోవడంతో కొనుగోలు చేసిన వినియోగదారులు బహిరంగంగానే అసంతృప్తి వెలిబుచ్చుతున్నారు. ఆదివారం స్థానిక కాటవీధికి చెందిన శ్యామలరావు స్థానిక పాన్‌షాప్ వద్ద రూ.10 విలువ చేసే హెరిటేజ్ సంస్థకు చెందిన పెరుగు ప్యాకెట్‌ను కొనుగోలు చేసి విప్పి చూడగా అందులో నాచులాంటి పదార్ధం దర్శనమిచ్చింది.
దీంతో కొనుగోలుదారు శ్యామ్ తిరిగి దుకాణదారుడి వద్దకు వెళ్లినా తమకు సంబంధం లేదంటూ సమాధానమివ్వడంతో అవాక్కయ్యాడు. ఆహారకల్తీ నిరోధక అధికారులు ఇప్పటికైనా స్పందించి ఇలాంటి నాణ్యతా లోపం కలిగిన ఆహార పదార్థాల విక్రయాలపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment