హైకోర్టు విభజనపై ముగిసిన ఏపీ వాదనలు
హైదరాబాద్: హైకోర్టు విభజనకు సంబంధించి బుధవారం హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాదనలు పూర్తి అయ్యాయి. విభజన చట్టం నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్రత్యేక ప్యాకేజీపై స్పష్టత రావాల్సి ఉందని ఏపీ తన వాదనలలో పేర్కొంది. అలాగే విభజన చట్టం నిబంధనల మేరకు హైకోర్టు ఏర్పాటుకు తాము సిద్ధమేనని స్పష్టం చేసింది.
కాకుంటే హైకోర్టు ఏర్పాటు చేసే ప్రాంతాన్ని రాష్ట్రపతి నోటిఫై చేయాల్సి ఉందని ఏపీ గుర్తు చేసింది. అయితే హైకోర్టు విభజనపై మధ్యాహ్నం తర్వాత కేంద్రం తన వాదనలు వినిపించనుంది.