విజయనగరం పట్టణంలో శుక్రవారం ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమైక్యాంధ్రకు మద్దతుగా విజయనగరంలో న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు. అయితే పట్టణంలో 30 యాక్ట్ అమలులో ఉందని, ఆ నేపథ్యంలో అనుమతి లేదంటూ పోలీసులు న్యాయవాదుల ర్యాలీని అడ్డుకున్నారు. దాంతో న్యాయవాదులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. దాంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
రాష్ట్రంలో ఎక్కడ పోలీసులు 30 యాక్ట్ అమలు చేయడం లేదంటూ న్యాయవాదులు ఆరోపించారు. ఒక్క విజయనగరం పట్టణంలోనే ఆ యాక్ట్ అమలు ఎందుకు చేస్తున్నారంటూ న్యాయవాదులు పోలీసులును ప్రశ్నించారు. న్యాయవాదుల ప్రశ్నలకు పోలీసులు నుంచి సరైన స్పందన రాలేదు. దాంతో న్యాయవాదులు విజయనగరం గ్రామీణ పోలీసు స్టేషన్ ఎదుట న్యాయవాదులు బైఠాయించారు.