
సాక్షి, తూర్పుగోదావరి : కాకినాడలోని ఎల్బీనగర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమీపంలోని ఐటీఐ వెనుక ఉన్న ఆరు కుటుంబాల నివాసాలను మున్సిపల్ అధికారులు తొలగించేందుకు ప్రయత్నించారు. పోలీసులు, మున్సిపల్ అధికారులు బలవంతంగా ఇళ్లును తొలగించడంతో స్థానికులు ఇళ్లలోనే ఉండి తలుపులు వేసుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వీరి నివాసానికి పక్కనే కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు స్థలం ఉందని, ఎమ్మెల్యే ఆదేశాల మేరకే తమను ఖాళీ చేయిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ఖాళీ చేయించి స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఎమ్యేల్యే ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment