MLA Kondababu
-
ఎమ్మెల్యే కొండబాబు అలక.. శంకుస్ధాపనకు డుమ్మా
సాక్షి, కాకినాడ జిల్లా: కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అలక బూనారు. బయో మెథనేషన్ ప్లాంట్ శంకుస్ధాపనకు డుమ్మా కొట్టారు. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ హాజరుకాగా, ఎమ్మెల్యే కొండబాబు రాకపోవడంతో శంకుస్ధాపన, భూమి పూజకు ఆయన దూరంగా ఉన్నారు. ఎమ్మెల్యేలు లేకుండానే ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీతో కలిసి మున్సిపల్ కమిషనర్ భావన ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ప్లాంట్‌కు మున్సిపల్ కార్పొరేషన్ రెండెకరాల స్ధలం కేటాయించింది. ప్లాంట్‌కు మున్సిపల్ కమిషనర్ భావన భూ కేటాయింపు చేయడంపై ఎమ్మెల్యే కొండబాబు గుర్రుగా ఉన్నారు. ‘‘నాకు తెలియదు.. నన్ను పిలవకండీ" అంటూ కొండబాబు చెప్పారంటూ చర్చ సాగుతోంది. గత కొంతకాలంగా మున్సిపల్ కమిషనర్ భావన, సిటీ ఎమ్మెల్యే మధ్య గ్యాప్ కొనసాగుతోంది. -
‘స్మార్ట్ సిటీ పనుల్లో ఎమ్మెల్యే అక్రమాలు’
సాక్షి, కాకినాడ: స్మార్ట్ సిటి పనుల్లో కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే కొండబాబు భారీగా ముడుపులు దండుకున్నారని వైఎస్సార్సీపీ నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. వేసిన రోడ్ల మీదనే మళ్లీ రోడ్లు వేస్తున్నారని, పార్కుల్లో పాత గోడలకే రంగులేసి కొత్తగోడలు చూపిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. పనుల క్వాలీటి కంట్రోల్ పరిశీలించడం లేదని, ఎక్కడా నాణ్యత కానరావడం లేదని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే స్మార్ట్ సిటీ పనుల మీద సమీక్ష చేస్తామని, పనుల నాణ్యత మీద విచారణ జరుపుతామని ద్వారంపూడి స్పష్టం చేశారు. అవినీతి జరిగిందని తేలితే ప్రజా ప్రతినిధులు, కాంట్రాక్టర్లు, అధికారుల మీద చర్యలు తప్పవని హెచ్చరించారు. కొన్ని పనులకు టెండర్లు లేకుండా నామినేషన్ల మీద పనులు అప్పగించారని విమర్శించారు. స్మార్ట్ సిటీ పనుల మీద విజిలెన్స్, మున్సిపల్ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. -
స్మార్ట్ సిటీ నిధులు దుర్వినియోగం అయ్యాయి
-
కాకినాడ ఎమ్మెల్యే కొండబాబుకు అసమ్మతి సెగ
-
వైఎస్ఆర్సీపీ నిరసనతో దిగొచ్చిన ఎమ్మెల్యే కొండబాబు
-
కాకినాడలో ఉద్రిక్తత
సాక్షి, తూర్పుగోదావరి : కాకినాడలోని ఎల్బీనగర్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమీపంలోని ఐటీఐ వెనుక ఉన్న ఆరు కుటుంబాల నివాసాలను మున్సిపల్ అధికారులు తొలగించేందుకు ప్రయత్నించారు. పోలీసులు, మున్సిపల్ అధికారులు బలవంతంగా ఇళ్లును తొలగించడంతో స్థానికులు ఇళ్లలోనే ఉండి తలుపులు వేసుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వీరి నివాసానికి పక్కనే కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు స్థలం ఉందని, ఎమ్మెల్యే ఆదేశాల మేరకే తమను ఖాళీ చేయిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ఖాళీ చేయించి స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఎమ్యేల్యే ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. -
‘ఆ విషయంలో కొండబాబు బాబునే మించిపోయాడు’
సాక్షి, కాకినాడ: కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కో-ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నిప్పులు చెరిగారు. అబద్ధాలు చెప్పడంలో కొండబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మించిపోయాడని అన్నారు. ఈ మధ్య కొండబాబు అబద్ధాలతోపాటు నటన కూడా నేర్చారని ఎద్దేవా చేశారు. అన్నపూర్ణ ట్రాన్స్పోర్ట్ పెట్టి ఎంతో చరిత్ర కలిగిన కాకినాడ లారీ యూనియన్ను కొండబాబు తొక్కిపెట్టారనీ, కాకినాడ చరిత్రలో ఇంతటి అవినీతి పరున్ని చూడలేదని అన్నారు. బుధవారం ద్వారంపూడి మీడియాతో మాట్లాడారు. పట్టుబడింది ఆయన అనుచరుడే ఆయిల్ మాఫీయాలో పోలీసులకు పట్టుబడింది టీడీపీ నేత కొండబాబు ప్రధాన అనుచరుడేనని ద్వారంపూడి ఆరోపించారు. 100 కోట్ల రూపాయల ఆయిల్ స్కామ్ జరిగితే అందులో రూ.50 కోట్లు కొండబాబు దండుకున్నాడని అన్నారు. ప్రభుత్వాధికారుల బదిలీల్లో కూడా కొండబాబు అవినీతికి పాల్పడుతున్నాడని అన్నారు. పోలీసు, మున్సిపల్ అధికారుల బదిలీలలో కొండబాబు ముడుపులు తీసుకుంటున్నారని ఆరోపించారు. పేకాట క్లబ్బులు, సింగిల్ నెంబర్ లాటరీ, గుట్కా వ్యాపారుల నుంచి కొండబాబు బంధువులకు మామూళ్ళు అందుతున్నాయని అన్నారు. -
పోతోంది ‘దేశం’ పరువు
సాక్షి ప్రతినిధి, కాకినాడ : నేతల మధ్య విభేదాలు... పార్టీ ప్రతిష్టను దిగజార్చుతూ జరుగుతున్న వరుస పరిణామాలతో టీడీపీ వర్గాలు అంతర్మధనంలో పడ్డాయి. ముఖ్యంగా కాకినాడ సిటీ, రూరల్ ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న అంతర్గత పోరుతో ఎప్పటికప్పుడు పార్టీ రచ్చకెక్కడం ఆందోళన రేకెత్తిస్తోంది. రెండు నెలల కిందట ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు ఆరోపణలకు దిగడం... ఇటీవల ఆయిల్ మాఫియా నడుపుతున్న టీడీపీ నేతల బాగోతం బయటపడటం... తాజాగా ప్రభుత్వ రోడ్డును ఎమ్మెల్యే కొండబాబు కుటుంబీకులు ధ్వంసం చేయడంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందన్న భయం నెలకొంది. విభేదాలెన్నెన్నో.... కాకినాడ అంతా తనదిగా భావిస్తూ, ఏం చేసినా అడిగే వారు లేరనే ధోరణితో ఎమ్మెల్యే కొండబాబు వ్యవహరించడం కొందరు టీడీపీ నేతలకు నచ్చడం లేదు. ఇక్కడ ఎవరూ వేలు పెట్టకూడదని, మంత్రైనా సరే అనే ధోరణిలో నియంతృత్వ పోకడకు పోతున్నారంటూ సహ నేతల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడుతోంది. దీంతో కొండబాబు లక్ష్యంగా పార్టీలోని ప్రత్యర్థులు పావులు కదుపుతున్నారు. ఆయన కుటుంబీకులు, అనుచరులచే దందా సాగిస్తున్నారని, ముఖ్యంగా ఎమ్మెల్యే కొండబాబు సోదరుడు సత్యనారాయణ సూపర్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులతో గత కొంతకాలంగా వైరం కొనసాగిస్తున్నారు. ఆ మధ్య పిల్లి సత్తిబాబు లక్ష్యంగా పరోక్ష ఆరోపణలకు దిగారు. దందాలన్నీ వారే చేస్తున్నారని, అక్రమాలన్నీ అక్కడే జరుగుతున్నాయని పార్టీ కార్యకర్తల సమావేశంలో బహిర్గతమయ్యారు. మరో సందర్భంలో మంత్రి చినరాజప్పపై కూడా పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించినట్టు పార్టీలో చర్చ జరిగింది. మంత్రి సోదరుడే ఎక్కువగా సెటిల్మెంట్లు, దందాలు చేస్తూ ఆరోపణలకు దిగినట్టు విస్తృత ప్రచారం సాగింది. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ముందస్తుగా పసిగట్టి కొండబాబు హవాకు చెక్ పెట్టే ప్రయత్నాలు ప్రత్యర్థులు చేస్తున్నారు. ఆ మధ్య కాకినాడ కార్పొరేషన్ మేయర్ గిరీని తన వర్గీయునికి దక్కకుండా అధిష్టానం స్థాయిలో అంతర్గత ప్రత్యర్థులు చక్రం తిప్పారు. డిప్యూటీ మేయర్ పదవి కూడా కొండబాబు వర్గానికి దక్కకుండా హైజాక్ చేశారు. చివరికీ కో ఆప్షన్ పదవుల్లో కూడా కొండబాబుకు చెక్ పెట్టారు. అంతేకాకుండా ఆయిల్ మాఫియాలో కీలకంగా వ్యవహరించిన కొండబాబు అనుచరుడు గ్రంధి బాబ్జీ విషయంలోనూ ఆరోపణలు గుప్పుమన్నాయి.. తాజాగా రోడ్డు విషయంలో... మహలక్ష్మీనగర్‌లో రోడ్డు వేయకముందే ఆ స్థలం తమదని, ప్రభుత్వ నిధులతో రోడ్డు వేయవద్దని రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మీ దృష్టికి ఎమ్మెల్యే కొండబాబు తీసుకెళ్లినట్టు సమాచారం. కానీ రూరల్ ఎమ్మెల్యే అవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వ నిధులతో రోడ్డు వేయాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలా అనుకున్నట్టుగానే అక్కడ చకచకా రోడ్డు వేసేశారు. తాను చెప్పినట్టుగా వినకుండా ఏకపక్షాన రోడ్డు వేశారన్న అక్కసుతో ఎమ్మెల్యే కుటుంబీకులు ధ్వంస రచనకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఇంకేముంది రూరల్ ఎమ్మెల్యే పిల్లి దంపతులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. మద్దతుగా నిలుస్తున్న మంత్రి కూడా అంతర్గతంగా పావులు కదిపారు. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి జరిగిన పరిణామాలను వివరించినట్టు తెలిసింది. « కలెక్టర్ ఆదేశాలతో ఎమ్మెల్యే కుటుంబీకులపై ఫిర్యాదు చేసే విషయంలో తీవ్ర ఒత్తిళ్లకు గురయ్యారు. నష్ట నివారణకు రంగంలోకి అధిష్టానం... కాకినాడలోని మహలక్ష్మీనగర్‌లో ప్రభుత్వ నిధులతో వేసిన రోడ్డును ఎమ్మెల్యే కొండబాబు «కుటుంబీకులు ధ్వంసం చేసిన ఘటనతో టీడీపీ పరువు మంటగలిసిపోయింది. అధికారం ఉందని ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తింది. తమ వేగుల ద్వారా విషయాన్ని తెలుసుకుని అధిష్టానం రంగంలోకి దిగింది. నష్ట నివారణకు చర్యలకు ఉపక్రమించింది. విచారణకు ఆదేశాలిస్తే వివాదాన్ని పక్కదారి పట్టించొచ్చన్న ఉద్దేశంతో కలెక్టర్‌కు సీఎం వ్యూహాత్మక ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. సీఎం ఆగ్రహం, ఆదేశాలపై లీకులిచ్చి సీరియస్‌ను తగ్గించే ప్రయత్నం జరిగింది. కానీ ఆ రోజు దగ్గరి నుంచి ఇంతవరకు ఘటనపై అధికార వర్గాలు నోరు మెదపడం లేదు. విచారణాధికారిగా ట్రైనీ కలెక్టర్‌ను నియమించినా ఇంతవరకు విచారణ ముందుకు సాగడం లేదు. కింది స్థాయి అధికారులు కూడా ఆ వివాదం జోలికి పోవడం లేదు. ఎవరో ఒకరి చేత ధ్వంసం చేసిన రోడ్డును వేయించేసి వివాదాన్ని ముగించేసేందుకు యత్నాలు కూడా జరుగుతున్నాయి. -
కాకినాడలో తమ్ముళ్ల గూండాగిరి
-
ఆగని అన‘కొండ’ కాట్లు
ఈ నెల మొదటివారంలో కొవ్వూరు రోడ్డు తారకరామానగర్ ప్రాంతంలోని సర్వే నెంబర్ 20/2ఎలో ఆ స్థల యజమానులు నిర్మాణాలు చేపడుతుంటే ఎమ్మెల్యే కొండబాబు అనుచరులు దాడి చేశారు. కొనుగోలు చేసి నిర్మాణాలు చేపట్టుకుంటున్న 60 మందిపై సుమారు పది మంది ఎమ్మెల్యే మనుషులు విచక్షణా రహితంగా దాడులకు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా అక్కడ నిర్మాణాల్ని దౌర్జన్యంగా కూల్చేశారు. ఆ 60 మంది చేత స్థలాలు కొనుగోలు చేయించిన ఎమ్మెల్యే అనుచరుడే ఆ తర్వాత వారిపై దాడి చేసి, ధ్వంస రచనకు పాల్పడ్డాడు. దాడుల్లో గాయపడ్డ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. తిరిగి బాధితుల్నే వేధించిన పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా కాకినాడ మహలక్ష్మీ నగర్లో ప్రభుత్వ నిధులతో వేసిన రోడ్డును ఎమ్మెల్యే కొండబాబు కుటుంబీకులు, అనుచరులు జేసీబీ సాయంతో తవ్వేసి ధ్వంసం చేశారు. ఈ విషయం తెలిసినా అధికారులు పట్టించుకోలేదు. రోడ్డేసిన స్థలం ప్రైవేటుదని, తమదే ఆ స్థలమని ఎమ్మెల్యే కుటుంబీకుల కను సన్నల్లో దౌర్జన్యానికి దిగారు. గూండా గిరీ ప్రదర్శించారు. రోడ్డును ధ్వంసం చేయడమే కాకుండా అడ్డొచ్చిన వారిని భయభ్రాంతులకు గురిచేశారు. స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకతతోపాటు ఫిర్యాదులు రావడంతో అధికారులు తప్పని పరిస్థితుల్లో స్పందించారు. సాక్షి ప్రతినిధి,తూర్పుగోదావరి, కాకినాడ: కాకినాడలో టీడీపీ ఆగడాల్లకు అంతులేకుండా పోతోంది. వరుస ఘటనలు పట్టణం నడిబొడ్డున యథేచ్ఛగా జరుగుతున్నా జిల్లా అధికారులు ప్రేక్షకపాత్రకే పరిమితమవుతున్నారు. తాజా ఘటనలతోపాటు ఇదే నెల మొదటి వారంలో జరిగినవే కాకుండా గత ఏడాదిలో కాకినాడ మెయిన్ రోడ్డులోని జగన్నాథపురం వంతెన సమీపంలో విలువైన స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై ఎమ్మెల్యే అనుచరులు రాత్రికి రాత్రి కబ్జా చేసేందుకు యత్నించిన వైనం అప్పట్లో వివాదస్పదమయింది. ఆ స్థలంలో ఉన్న షాపును బలవంతంగా ఖాళీ చేయించేందుకు యత్నించడంతోపాటు ఎమ్మెల్యే అనుచరులు పొక్లైనర్‌ను తీసుకెళ్లి కూల్చేందుకు ప్రయత్నించారు. ఇవన్నీ అధికార అండ చూసుకుని చేసినవే. జిల్లా కేంద్రమైన కాకినాడలో ఇటువంటి దారుణాలు అనేకం జరుగుతున్నా అడ్డుకట్ట వేసేందుకు అధికారులు సాహసించడం లేదు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు ఏమాత్రం భయం లేకుండా తెగబడుతున్నారు. దాడులకు దిగి, ధ్వంస రచనకు పాల్పడిన భూముల్ని తమ గుప్పెట్లోకి తెచ్చుకునేందుకు చేసిన ఎత్తుగడే. గతంలో జరిగిన ప్రయివేటు షాపు కూల్చివేత , మొన్న తారకరామ నగర్లో చేసిన దౌర్జన్యకాండ పక్కన పెడితే తాజాగా మహలక్ష్మీ నగర్లో ప్రభుత్వ రోడ్డును ధ్వంసం చేసిన ఘటన మరింత దారుణమైంది. అసలు అక్కడ తమ భూములగా చెప్పుకుంటున్నవాటిపైనే అనుమానాలున్నాయి. అసలా భూములపైనే అనుమానాలు సముద్ర నీరు వేసిన మేటల్ని ఆక్రమంచి, తమవిగా రికార్డుల్లో ఎక్కించే యత్నాలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. అక్కడున్న పోలీసు ౖరైఫిల్ రేంజ్ స్థలం కూడా ఆక్రమణకు గురైందన్న వాదనలున్నాయి. సముద్రం ఒడ్డున స్తంభాలు వేసి తమ భూములగా చెప్పుకుంటున్న వైనంపైనే సందేహాలున్నాయి. ఇవేవీ అధికారులకు పట్టడం లేదు. ఆ భూముల సంగతేమిటన్నది తేల్చడం లేదు. వాస్తవ పరిస్థితులు గుర్తించకుండా వదిలేయడంతోనే సముద్రం ఒడ్డున ఉన్న భూములన్నీ కబ్జాకు గురవుతున్నాయి. ఇవన్నీ ఎమ్మెల్యే అనుచరుల చేతుల్లో ఉండటంతో వారి ఆగడాలకు అడ్డు అదుపూలేకుండా పోతోంది. రూ.6 లక్షల ప్రభుత్వ నిధులతో పట్టపగలు, జేసీబీని తీసుకెళ్లి ధ్వంసం చేశారంటే ఏ స్థాయిలో బరితెగించారో అర్థం చేసుకోవచ్చు. ఇది చాలదన్నట్టు రోడ్డును ధ్వంసం చేసినచోట స్థానికుల శిబిరం ఏర్పాటు చేసి, నిరసన తెలియజేస్తుంటే వారిపై కొందర్ని ఉసిగొల్పి భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. అక్కడున్న టెంట్లు తొలగించాలని హెచ్చరిస్తున్నారు. దీంతో స్థానికులు మరింత భయాందోళనకు గురవుతున్నారు. సోమవారం బాధితులంతా కలెక్టర్‌కు ఫిర్యాదు కూడా చేశారు. వీరే కాకుండా అక్కడ వివాదాస్పదంగా ఉన్న భూములపై కొందరు చేస్తున్న అజమాయిషీపై కూడా ఫిర్యాదులు చేశారు. విషయం అంతవరకు వెళ్లినా స్థానిక అధికారులకు ఏమాత్రం పట్టనట్టే ఉన్నారు సరికదా ఆ రోడ్డు తాము వేయలేదని ఎమ్మెల్యే మనుషులకు వత్తాసు పలికే పరిస్థితి నెలకుంది. మీడియాలో పతాక శీర్షికల్లో దౌర్జన్యకాండా వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు ఎట్టకేలకు స్పందించారు. ఎమ్మెల్యే కుటుంబీకులపై ఎట్టకేలకు కేసు నమోదు : స్థానికులు ఆందోళనలకు దిగడం, వైఎస్సార్సీపీ, సీపీఎం, సహా పలువురు ప్రజలు, ప్రజా సంఘాలు ఎమ్మెల్యే తీరుపై తీవ్రస్థాయిలో మండిపడిన నేపథ్యంలో కలెక్టర్ జోక్యం చేసుకున్నారు. జిల్లా పం చాయతీ అధికారి ద్వారా ఆదేశాలిప్పించి తూరంగి పంచాయతీ ప్రత్యేకాధికారి పి.మణేశ్వరావు చేత ఇంద్రపాలెం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయించారు. పబ్లిక్ ప్రాపర్టీస్ ధ్వంసం దృష్ట్యా పలు సెక్షన్ల కింద ఎమ్మెల్యే సోదరుడు వనమాడి సత్యనారాయణ, ఆయన కుమారుడు ఉమాశంకర్‌తోపాటు మరో ఏడుగురిపై కేసులు నమోదయ్యాయి. -
టీడీపీలో ‘కొండబాబు’ రగడ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఆధిపత్యానికి, ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారన్న అక్కసుతో కాకినాడ నగర ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు) స్వరం పెంచుతున్నారు. ఎమ్మెల్యే అని చూడడం లేదు...మంత్రి అని తగ్గడమూ లేదు... సహ నేతలపై మాటల యుద్ధం ప్రకటిస్తున్నారు. అవినీతి ఆరోపణలతో వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. నువ్వానేనా అన్నట్టుగా ఏదో ఒకటి తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇదే అదనుగా స్వప్రక్ష ప్రత్యర్థులు కూడా కొండబాబుని లక్ష్యంగా చేసుకొని పావులు కదుపుతున్నారు. కాకినాడ నగరమంతా తనదిగా ఎమ్మెల్యే కొండబాబు భావించడమే కాకుండా ఎంతటి పెద్ద నేతలైనా తన తర్వాతే అన్నట్టుగా వ్యవహరిస్తుండగా జిల్లా కేంద్రమైన కాకినాడ అందరిదీ అనే రీతిలో మంత్రి నిమ్మకాయల చినరాజప్పతోపాటు మిగతా నేతలూ భావిస్తున్నారు. ఆ తరహాలోనే కాకినాడకు వచ్చి పలువురు నేతలు చక్రం తిప్పుతుండడంతో కొండబాబు అగ్గిమీద గుగ్గిలమైపోతున్నారు. కొండబాబే లక్ష్యంగా... వాస్తవానికి ఎమ్మెల్యే కొండబాబుపై అనేక ఆరోపణలున్నాయి. ఆయన సోదరుడు సత్యనారాయణైతే సూపర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారన్న విమర్శలున్నాయి. పార్టీలోని ప్రత్యర్థులకు ఇవి అస్త్రాలుగా మారాయి. కాకినాడలో పార్టీకి చెడ్డపేరు వస్తుందన్న ప్రచారానికి ప్రత్యర్థులు తెరలేపారు. ఇదే క్రమంలో కాకినాడ కార్పొరేషన్ మేయర్ గిరీని తన వర్గీయులకు దక్కకుండా మంత్రి రాజప్ప, ఎంపీ తోట నర్సింహం వ్యవహరించారు. కనీసం డిప్యూటీ మేయర్ పదవైనా దక్కించుకోవాలని, ముఖ్యంగా మత్స్యకార సామాజిక వర్గానికి ఇప్పించుకోవాలని కొండబాబు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి వ్యూహాత్మకంగా ఎగరేసుకుపోయారు. కార్పొరేషన్‌లోని కో ఆప్షన్ పదవులైనా దక్కించుకోవాలని ఆరాటపడుతున్నా అది కూడా ఫలించేలా లేదు. దీంట్లో మంత్రి రాజప్ప జోక్యం చేసుకుని కొండబాబు వశం కాకుండా పావులు కదుపుతున్నారు. ఇలా అడుగుగడుగునా ప్రతికూల పరిస్థితులే ఎదురవుతుండడంతో ఆ వర్గం అయోమయంలో పడింది. రగిలిపోతున్నా అదే బాట... వరుసగా ఎదురవుతున్నా అవమానాలు, వస్తున్న ఆరోపణలతో కొండబాబు రగిలిపోతున్నారు. తానడిగిన మేరకు ఇవ్వకపోగా కాదన్న వాటికి ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపోతున్నారు. దీంతో మొన్నటికి మొన్న రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులు లక్ష్యంగా పరోక్ష ఆరోపణలకు దిగగా, తాజాగా మంత్రి రాజప్పపైనే ధ్వజమెత్తుతున్నట్టు తెలిసింది. మంత్రి సోదరుడే ఎక్కువ సెటిల్మెంట్లు, దందాలు చేస్తున్నారంటూ ఆరోపణలు సంధిస్తున్నారు. కాకినాడ సిటీ నియోజకవర్గంలో రాజప్ప పెత్తనమేమిటని ప్రశ్నించడమే కాకుండా తన నియోజకవర్గంలో ఎవరి జోక్యం అవసరం లేదని పట్టుబడుతున్నారు. అధిష్టానం వద్దే తేల్చుకుంటానని తన అనుయాయుల వద్ద వాపోతున్నట్టు తెలిసింది. ఒకరిపై ఒకరు ధ్వజమెత్తుతూ సాగుతున్న పోరు టీడీపీలో అసక్తి రేకెత్తిస్తోంది. -
‘సాయంత్రంలోగా నీ అంతు చూస్తా...’
► వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి టీడీపీ ఎమ్మెల్యే హెచ్చరిక ►సోదరుడి కుమారుడిపై పోటీ చేయడమే.. ► సైకిల్‌కు ఓటు వేయాలంటూ ప్రచారం సాక్షి, కాకినాడ: కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే(టీడీపీ) వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు), ఆయన సోదరుడు సత్యనారాయణ హద్దుమీరి ప్రవర్తించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను బెదిరించారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారు. నిబంధనలను ఉల్లంఘించారు. ఎన్నికల కేంద్రాల వద్ద ప్రచారం చేశారు. ‘సాయంత్రం నాలుగు గంటలకల్లా నీ అంతు చూస్తా’ అంటూ వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి అంకడి సత్తిబాబును ఎమ్మెల్యే కొండబాబు బెదిరించారు. ఎమ్మెల్యే కొండబాబు అన్న సత్యనారాయణ కుమారులు ఉమాశంకర్ 14వ డివిజన్, ప్రసాద్ 23వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నారు. 14వ డివిజన్ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అంకడి సత్తిబాబు బరిలోకి దిగారు. ఎక్కడ తన కుమారుడు ఓడిపోతాడోనన్న భయంతో వనమాడి సత్యనారాయణ మంగళవారం 14వ డివిజన్ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లను ప్రలోభపెట్టారు. తన కుమారుడికి ఓటు వేయాలని అన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద తిష్టవేసిన టీడీపీ నేతలను ఎందుకు అడ్డుకోవడం లేదని సత్తిబాబు పోలీసులను ప్రశ్నించారు. దీంతో వనమాడి సత్యనారాయణ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సత్తిబాబుపై బూతు పురాణం అందుకున్నారు. ఇంతలో అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే కొండబాబు.. సత్తిబాబు వైపు వేలు చూపిస్తూ ‘సాయంత్రం నాలుగు గంటల్లోపు నీ అంతు చూస్తా’ అని బెదిరించారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే కొండబాబు కాకినాడలో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద తిరుగుతూ సైకిల్‌కు ఓట్లు వేయాలని ప్రచారం చేశారు. అంతేకాకుండా తన అనుచరులతో పలు డివిజన్లలో భారీగా దొంగ ఓట్లు వేయించారు. -
ఆద్యంతం..పచ్చందారీతనమే..
కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ చివరి వరకు అధికార పార్టీ యథేచ్ఛగా డబ్బు పంపిణీ చేసింది. అధికార దుర్వినియోగం పెద్ద ఎత్తున జరిగింది. టీడీపీ నేతలు దాదాగిరీ ప్రదర్శించారు. ప్రత్యర్థులను బెదిరించారు. ‘నీ సంగతి చూస్తానంటూ’ ఒకరు, ‘డబ్బు పంపిణీని అడ్డుకుంటారా’ అని మరికొందరు, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ బూత్‌లో ప్రచారమేంటని అడిగినందుకు మరికొందరు రౌడీయిజానికి దిగారు. టీడీపీకి చెందిన సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరావు (కొండబాబు) తన సహజ శైలిలో వైఎస్సార్ సీపీ అభ్యర్థిపై అంతెత్తున లేచారు. మొత్తానికి టీడీపీ నేతల దౌర్జన్యాల మధ్య కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఎక్కడికక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. అధికార పార్టీ ఆగడాలను పోలీసులు అడ్డుకోలేకపోయారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆద్యంతం ‘పచ్చ’ం దారీతనమే పెత్తనం చెలాయించింది. పోలింగ్ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు చెలరేగి పోయారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ప్రచారం చేయడమే కాక అడ్డొచ్చిన ప్రతిపక్ష నాయకులపై దాదాగిరీ ప్రదర్శిం చారు. ‘నాలుగైతే నీగతి చూస్తా’నంటూ 14వ డివిజన్ వైఎస్సార్సీపీ అభ్యర్థి అంకాడి సత్తిబాబును హెచ్చరించారు. ఇక్కడొకచోటే కాదు ఆయన వెళ్లిన ప్రతి చోటా వివాదమే. 32, 33 డివిజన్ల్లో సిటీ ఎమ్మెల్యే öండబాబు దూకుడుతో మంగళవారం సాయంత్రం రామకృష్ణారావుపేటలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. తొలుత 33వ డివిజన్లో టీడీపి అభ్యర్థి వర్గీయులు, వైఎస్సార్ సీపీ అభ్యర్థుల మధ్య పోలింగ్ బూత్ ఏజెంట్ల విషయంపై వివాదం జరగ్గా ఎమ్మెల్యే కొండబాబు అక్కడకు చేరుకుని వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై బెదిరించే ధోరణిలో మాట్లాడారు. వనమాడి వెర్సెస్ ద్వారంపూడి ఎమ్మెల్యే కొండబాబుకు మాజీ ఎమ్మెల్యే, వైఎస్పార్ సీపీæ సిటీ కోఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి దీటుగా బదులిచ్చారు. ఆయన ఇరువర్గీయులను సముదాయిస్తుండగా ఎమ్మెల్యే కొండబాబు 33వ పోలింగ్ బూత్‌లోకి వెళ్ళారు. దీంతో ద్వారంపూడి బూత్‌లోకి వెళ్ళేందుకు ప్రయత్నిçస్తుండగా పోలీసులు కుదరదంటూ అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కోడ్ ఉల్లంఘించి లోపలకి వెళ్లొచ్చా అంటూ ఆగ్రహం వ్యక్తం చేయగా పోలీసులు ఎమ్మెల్యేను వెనక్కి రప్పించారు. దీంతో వెనుదిరిగిన ఆయన అక్కసుతో 32వ డివిజన్లోని పోలింగ్ బూత్‌కు వెళ్ళారు. ఇక్కడ బూత్ లోపలి నుంచి బయటకు వస్తున్న వైఎస్సార్ సీపీ కార్యకర్త సైదులును ఎమ్మెల్యే కొండబాబు పోలీసుల సమక్షంలోనే కొట్టడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న ద్వారంపూడి మళ్ళీ అక్కడకు వచ్చేలోగానే ఎమ్మెల్యే కొండబాబు జారుకున్నారు. దీంతో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు దిగడంతో డీఐజీ రామకృష్ణ, ఎస్పీ విశాల్ గున్ని, డీఎస్పీలు సముదాయించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ సందర్భంగా ద్వారంపూడి విలేకరులతో మాట్లాడుతూ కోడ్ ఉల్లంఘించి ఎమ్మెల్యే చేసిన ఘాతుకంపై పోలీస్ ఉన్నతాధికారులకు, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. పోలీసులను నిలదీసిన ద్వారంపూడి కార్పోరేషన్ పరిధిలోని 34వ వార్డు పోలింగ్ కేంద్రంలోకి ఎమ్మెల్యే కొండబాబు ప్రవేశించి ఓటర్లను ప్రలోభ పెట్టటంపై వైఎస్సార్సీపీ ఆందోళన వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే సుమారు పావుగంట సేపు పోలింగ్ కేంద్రంలోనే ఉండడంపై వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వార్డు నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పసుపులేటి వెంకటలక్ష్మి ఈ విషయాన్ని పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడికి సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడకు వచ్చి పోలీసుల వైఖరిని తప్పుబట్టారు. ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించేందుకు ఏం అర్హత ఉందని ప్రశ్నించారు. అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దీనిపై ఇప్పటికే ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడం నిబంధనలకు విరుద్ధమని చెప్పినట్లు తెలిపారు. ‘ఓటేయకుంటే పింఛన్లకు చేటు..’ 37వ డివిజన్ ఫ్రేజర్‌పేట మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో వృద్ధులు, వికలాంగులను తమ పార్టీకి ఓట్లు వే యాలని లేని పక్షంలో మిమ్మల్ని గుర్తుపెట్టుకుని పింఛన్లతో పాటు ప్రభుత్వ పథకాలు ఏమీ రాకుండా చేస్తామంటూ టీడీపీ నాయకులు హెచ్చరించారు. ఒకానొక సమయంలో తెలుగుతమ్ముళ్లు మంద బలాన్ని ఉపయోగించి పోలింగ్ కేంద్రం బయట ఘర్షణ వాతావరణాన్ని సృష్టించారు. పోలింగ్ బూత్‌లను అడిషనల్ ఎస్పీ దామోదర్, సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాలు సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. వృద్ధులు, వికలాంగులకు ఏర్పాటు చేసిన వాహనాలను టీడీపీ, బీజేపీ నేతలు పోలింగ్ బూత్ వరకూ తీసుకురావడంతో వైఎస్సార్సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వారు యథేచ్ఛగా లోనికి ప్రవేశించగా వారిపై పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన నామమాత్రంగా బెదిరించారు తప్ప వారిని ఏమీ అనలేక పోయేవారు. అధికారంలో ఉన్నాం ఏమైనా చెయ్యగలమంటూ టీడీపీ నాయకులు అసభ్యపదజాలంతో వైఎస్సార్ సీపీ వారిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. వారు ఎంత రెచ్చగొట్టినా పోలింగ్ ప్రశాంతంగా జరగాలంటూ వారితో పాటు పోలీసులను సముదాయించడంతో ప్రశాంత వాతావరణం ఏర్పడింది. లేనేలేని డోర్ నంబర్లో 40ఓట్లు 43 డివిజన్లోని బాలయోగి వీధిలో 64–16–40 డోర్నెంబర్లో 40 ఓట్లు ఉన్నాయి. వాస్తవానికి అక్కడ ఆ డోర్ నెంబర్ లేనేలేదు. అధికారి పార్టీ అభ్యర్థి పక్కా ప్రణాళిక ప్రకారం ఆ డివిజన్లో స్థానికేతరులకు ఓట్లు నమోదు చేయించారు. ఎన్నికలు నిర్వహించే ముందు కార్పొరేషన్ అధికారులు ఓటరు లిస్ట్ అభ్యంతరాలు తీసుకొనే సమయంలో ఈ డోర్ నెంబర్లో ఓట్లు లేవు. ఎన్నికలకు సిద్ధమైన తర్వాత అభ్యర్థులకు ఇచ్చిన ఓటర్ల జాబితాకు అదనంగా 40 ఓట్లతో వేరే పేజీ జత చేశారు. ఈ విషయాన్ని అక్కడ పోటీ చేసిన వైఎస్సార్కాంగ్రెస్పార్టీ అభ్యర్థి కోకా వెంకటగిరి, స్వతంత్ర అభ్యర్థి నమ్మి సత్యవాణి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. స్థానికేతరులు ఓట్లు వేసేందుకు రావడంతో పోలింగ్ ఏజెంట్లు అభ్యంతరం చెప్పారు. వారిది ఈ ప్రాంతమే కాదని ఓట్లు వేయనిచ్చేది లేదని పట్టుపట్టారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరుపార్టీలకు చెందిన వారు గుంపులుగా పోలింగ్ బూత్ వద్దకు చేరుకొనేందుకు వచ్చేందుకు ప్రయత్నించారు. అక్క డ విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ రాజేష్ ఎస్పీ విశాల్‌గున్నికి పరిస్థితిని ఫోన్లో వివరించడంతో వెంటనే మొబైల్‌పార్టీ పోలీసులను పంపారు. టీడీపీ అభ్యర్థి జేడీ పవన్‌కుమార్ వారికి ఎందుకు ఓట్లు ఇవ్వరని పోలింగ్ సిబ్బందితో వాగ్వివా దానికి దిగారు. ఎన్నికల జోనల్ అధికారి నారాయణమూర్తి పోలింగ్ కేంద్రానికి వచ్చి, ఇరువర్గాల వాదనలు విన్నారు. వారికి ఓట్లు ఉండి, గుర్తింపు కార్డులు ఉంటే ఓటు వేయవద్దనే అధికారం తమకు లేదన్నారు. దీంతో వారు యథేచ్ఛగా ఓట్లు వేసుకున్నారు. 4వ డివిజన్లో బీజేపీ అభ్యర్థి తోట నాగలక్ష్మి దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ వైఎస్సార్ సీపీ నేతలు ఆందోళన చేశారు. బూత్‌లో డబ్బుల పంపకంతో గలాటా 21వ డివిజన్లో 12.30 గంటల సమయంలో ఓ వ్యక్తి పోలింగ్‌బూత్‌లో నిలబడి ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయడాన్ని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పసిగట్టి గొడవ చేయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాల వారిని చెదరకొట్టేందుకు లాఠీచార్జ్ చేశారు. అధికార పార్టీ పోలీసు వర్గాల ద్వారా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయించడంపై ఇతరపార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేయడంతో ఆ వ్యక్తి అక్కడనుంచి వెళ్లిపోయాడు. 4.30 గంటల సమయంలో టీడీపీ అభ్యర్థి భర్త పోలింగ్‌బూత్‌లోకి మోటార్‌సైకిల్‌పై రావడంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు అభ్యంతరం చెప్పడంతో పోలీసులు అక్కడ నుంచి పంపించి వేశారు. 14వ డివిజన్లో ఏటిమొగ అమృతసదన్ పాఠశాలలో టీడీపీ అభ్యర్థి వనమాడి ఉమాశంకర్, కార్యకర్తలతో వచ్చి పోలింగ్‌బూత్ వద్ద ప్రచారం టీడీపీకి ఓటు వేయాలంటూ ఓటర్లను కోరుతుండడంతో వైఎస్సార్సీపీ నేతలు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ వచ్చి టీడీపీకి ఓటు వేయాలంటూ ప్రచారం నిర్వహించారు. పోలీసులు కూడా అధికారపార్టీ నాయకులకు మద్దతు పలికారు. ఎస్పీ విశాల్ గున్ని, ఉత్తరకోస్తా ఐజీ విశ్వజిత్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. పోలీసుల పక్షపాత వైఖరి.. 38వ డివిజన్లో టీడీపీ అభ్యర్థి మాకినీడి శేషుకుమారికి సహకరిస్తున్న కానిస్టేబుల్‌ను వదిలిపెట్టి, వైఎస్సార్సీపీకి మద్దతుగా వ్యవహరిస్తున్నారంటూ ఒక ఎస్సైని ఆ పోలింగ్ కేంద్రం విధుల నుంచి తొలగించడం విశేషం. ఈ పోలింగ్ కేంద్రం వద్ద ఇరుపార్టీల నాయకులు వంద మీటర్లలోపులో ఉండరాదని ఎస్సై హెచ్చరించారు. ఈ చర్యలను జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు ఎస్సై వైఎస్సార్ సీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఎస్పీ గున్నికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి అక్కడ విధుల్లో ఉన ఎస్సైని బయటికి పంపారు. అయితే పోలింగ్ ప్రారంభం నుంచి టీడీపీ నాయకులకు సహకరిస్తున్న ఒక కానిస్టేబుల్‌పై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోక పోవడాన్ని వైఎస్సార్ సీపీ నాయకులు దుయ్యబట్టారు. పోలీసులు సైతం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కండువాతో బీజేపీ నేత 39వ డివిజన్లో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా వచ్చిన ఆ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు మెడలో పార్టీ కండువాను వేసుకోవడం వివాదస్పదమైంది. మెడలో కండువాను తొలగించాలని ఇండిపెండెంట్ అభ్యర్ధి అనుచరులు డిమాండ్ చేశారు. అయితే తాను 200 మీటర్ల దూరంలో ఉన్నానని తాను తీయాల్సిన పనిలేదని చెప్పడంతో వారు వాగ్వాదానికి దిగారు. ఇంతలో అక్కడకు మీడియా చేరుకోవడంతో ఆయన జారుకున్నారు. పచ్చచొక్కాలతో ప్రచారం 35వ డివిజన్ పోలింగ్ జరుగుతున్న కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో గల పీఆర్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల వద్ద పచ్చ చొక్కాలు వేసుకుని ఓటర్లను ప్రలోభ పెట్టారు. అది గమనించిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు వారి ప్రచారాన్ని అడ్డుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ పట్టించుకోకపోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి టీడీపీ నాయకులను వారించారు. ఇదిలా ఉండగా ఈ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్న బలువూరి రామకృష్ణ నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ కేంద్రంలోనే ఉండి ఓటర్లను ప్రలోభపెట్టినప్పటికీ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. పోలీసుల తీరుతో ఓటర్ల బేజారు పోలింగ్ ప్రారంభంలో పోలీసులు అనుసరించిన తీరుతో ఓటర్లు బేజారెత్తారు. ముగ్గురు, నలుగురు కల్సి ఓటువేయడానికి వచ్చినా చెదరకొట్టే ప్రయత్నంచేశారు. టీడీపీ అభ్యర్థులు పోలింగ్ బూత్ వద్ద ఉన్నా పట్టించుకోని పోలీసులు, వైఎస్సార్సీపీ అభ్యర్థులను 100 మీటర్ల దూరంలో ఉండాలని చెప్పడం కనిపించింది. గంట గడిచేసరికి అధికార పార్టీ నాయకుల నుంచి ఫోన్లు రావడంతో వెనక్కి తగ్గారు. చివరి నిమిషంలో రిగ్గింగ్ యత్నం 49వ డివిజన్లో టీడీపీకి చెందిన కొందరు చివరి నిమిషంలో రిగ్గింగ్‌కు పాల్పడేందుకు సిద్ధం కాగా, వైఎస్సార్ సీపీ, ఇండిపెండెంట్ అభ్యర్థుల మద్దతుదారులు అడ్డుకున్నారు. దీంతో రిగ్గింగ్‌కు పాల్పడేందుకు వెళ్లారన్న ఆరోపణలు ఎదుర్కొన్న వారంతా వారు బయటకు వచ్చారు. అయితే అప్పటికే ఎన్నికల అధికారులు పోలింగ్ సమయం ముగిసిందని ప్రకటించారు. 16, 17, 18 డివిజన్లలో పోలింగ్‌బూత్‌ల వద్ద టీడీపీ, వైఎస్సార్సీపీ అభ్యర్థులు నిలబడి ఓటర్లను ఓట్లు అభ్యర్థించే విషయమై ఘర్షణ వాతావరణం నెలకొంది. -
కొండబాబు ఇంటిని ముట్టడించిన డ్వాక్రా మహిళలు