అతని పొట్టనిండా నాణేలే
కడుపులోంచి 173 నాణేల వెలికితీత
కర్ణాటక రాష్ర్టం బళ్లారిలోని విజయనగర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (విమ్స్)లో ఓ వ్యక్తికి అరుదైన శస్త్రచికిత్స చేశారు. అతని కడుపు నుంచి 173 నాణేలు వెలికితీశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కర్ణాటకలోని రాయచూరు జిల్లా సింధనూరు తాలూకాలో స్థిరపడ్డాడు. అతనికి మతిస్థిమితం లేదు. అప్పుడప్పుడు తనకు తెలీకుండానే నాణేలు మింగాడు.
దీంతో కడుపునొప్పి, మూత్ర విసర్జన సమస్యలు తలెత్తాయి. దీంతో అతని బంధువులు 15 రోజుల క్రితం బళ్లారి విమ్స్‌లో చేర్పించారు. ఆ వ్యక్తి కడుపులో నాణేలు ఉన్నట్లు స్కానింగ్ ద్వారా వైద్యులు గుర్తించారు. మంగళవారం శస్త్ర చికిత్స చేసి, 173 రూపాయి, ఐదు, పది రూపాయల నాణేలను బయటకు తీశారు. రోగికి ఎలాంటి ప్రాణాప్రాయమూ లేదని వైద్యులు తెలిపారు. - సాక్షి, బళ్లారి