జెడ్పీ ఎన్నికను సజావుగా నిర్వహించాలి | Hospitals are required to maintain the smooth election | Sakshi
Sakshi News home page

జెడ్పీ ఎన్నికను సజావుగా నిర్వహించాలి

Published Fri, Jul 18 2014 2:54 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

జెడ్పీ ఎన్నికను సజావుగా నిర్వహించాలి - Sakshi

జెడ్పీ ఎన్నికను సజావుగా నిర్వహించాలి

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట):ఈ నెల 20న జరగనున్న నెల్లూరు జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను సజావుగా నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ నాయకులు ఎలక్షన్ కమిషన్(ఈసీ) కార్యదర్శి నవీన్‌మిట్టల్‌ను కోరారు. ఈమేరకు వైఎస్సార్‌సీపీకి చెందిన సర్వేపల్లి, ఆత్మకూరు, నెల్లూరు నగర ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, డాక్టర్ పోలుబోయిన అనీల్‌కుమార్‌యాదవ్ గురువారం హైదరాబాద్‌లో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. గతంలో జరిగిన గందరగోళాలను దృష్టిలో ఉంచుకుని అవి పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కోరారు.
 
 న్యాయపరంగా స్వేచ్ఛా, స్వతంత్రాలతో ఎన్నికలు జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. గందరగోళ పరిస్థితులు నెలకొనడంలో పోలీసుల పాత్రలను వారు ఆయనకు వివరించారు. గతంలో జరిగిన విషయాలను పరిగణనలోకి తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ఎన్నికలు జరపాలన్నారు. ఈసీ కార్యదర్శి నవీన్‌మిట్టల్ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యేలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement