
నిడమర్రు : అనారోగ్య కారణంగా (మెడికల్ ఇన్వాలిడేషన్) పదవీ విరమణకు అనుమతి పొందిన ప్రభుత్వ ఉద్యోగి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆ స్థానంలో మరో ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశం కల్పించబడింది. ఈ తరహా లబ్ధి పొందాలంటే ఉద్యోగి పదవీ విరమణకు కనీసం ఐదేళ్ల సర్వీసు కలిగి ఉండాలి. అలాగే ఉద్యోగి కుటుంబానికి ఎటువంటి జీవనాధారం లేని తీవ్రదుర్భర ప్రత్యేక పరిస్థితులు ఉన్నట్టు నియామకాధికారి సంతృప్తి చెందిన మీదట కొన్ని షరతులకు లోబడి ఉద్యోగి కుటుంబ ఆధారితులకు కారుణ్య నియామకానికి అనుమతిస్తారు. ఆ తరహా నియామకానికి సంబంధించిన సమాచారం తెలుసుకుందాం.
2008 నుంచి అవకాశం
అనారోగ్యం కారణం చూపిస్తూ ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగం తన వారసులకు పొందే ఒక కేసులో హైకోర్టు అట్టి కారుణ్య నియామకాలు రాజ్యాంగ విరుద్ధమని 1985లో తీర్పు వెలువరించిన దరిమిలా రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ ఇన్వాలిడేషన్‌పై కారుణ్య నియామకాల పద్ధతిని అప్పటి నుంచి రద్దుపరిచింది. తర్వాత సుప్రీం కోర్టు తీర్పు మేరకు ప్రభుత్వం మళ్లీ మెడికల్ ఇన్వాలిడేషన్‌పై ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల పద్ధతిని 2008 నుంచి మరలా పునరుద్ధరించింది.
ఈ నియామకాలకు అర్హులు
♦ కుటుంబ సభ్యులు అనగా ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980లోని రూల్ 50(12బీ) లో నిర్దేశించిన వారై ఉండాలి.
♦ భార్య/భర్త, కుమారులు, కుమార్తెలు, చట్టరీత్యా దత్తత తీసుకున్న కుమారుడు/ కుమార్తె. అయితే అట్టి దత్తత రిటైర్మెంట్‌కు ముందుగా తీసుకుని ఉండాలి. అవివాహిత లేదా విధవరాలైన లేదా విడాకులు పొందిన కుమార్తె అర్హులు.
మెడికల్ ఇన్వాలిడేషన్ నిబంధనలు
మెడికల్ ఇన్వాలిడేషన్ ఉద్యోగి నియామకాధికారికి దరఖాస్తు చేసుకోవాలి. సదరు దరఖాస్తు మెడికల్ బోర్డు సిఫార్సుల నిమిత్తం పంపుతారు. జానియర్ అసిస్టెంట్ తత్సమాన పోస్టు, అంతకంటే తక్కువవైన పోస్టులో నియామకం చేయవచ్చు.
♦ మెడికల్ ఇన్వాలిడేషన్‌పై ఉద్యోగి రిటైరైన తేది నుంచి ఏడాది లోపల ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాలి.
♦ నియామక ఉత్తర్వులు జారీచేసిన తర్వాత, అభ్యర్థికి సంబంధించిన అన్ని వివరాలు ఎంప్లాయిమెంట్ కార్యాలయానికి తెలియజేయాలి. మెడికల్ బోర్డు నివేదిక అందించిన తర్వాత ఉద్యోగ నియామక అధికారం జిల్లాస్థాయి కమిటీ వారి పరిశీలనార్థం పంపాలి.
జిల్లా స్థాయి కమిటీలో..
♦ జిల్లా కలెక్టర్–అధ్యక్షుడు
♦ జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి–సభ్యుడు
♦ సంబంధిత జిల్లా శాఖ అధికారి–సభ్యుడు/కన్వీనర్
♦ శాఖాధిపతి (హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్)కార్యాలయాల్లో పనిచేయు ఉద్యోగులు/ సెక్రటేరియట్ కమిటీ పరిశీలిస్తుంది.
♦ మెడికల్ ఇన్వాలిడేషన్ పథకం కింద, కారుణ్య నియామకాలు, యూనిట్ నియామకాల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఖాళీలలో 5 శాతం మించకూడదు. భార్య, భర్తలు ఇరువురు ఉద్యోగులైన సందర్భంలో కారుణ్య నియామకానికి అవకాశం లేదు. మెడికల్ ఇన్వాలిడేషన్ స్కీము జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్ టీచర్లకు వర్తింపచేశారు. మెడికల్ ఇన్వాలిడేషన్ (అనారోగ్య కారణాలపై) వైద్య ధ్రువపత్రం ద్వారా రిటైర్ అయిన వారికి పెన్షన్, కమ్యుటేషన్ అవకాశంలేదు. మెడికల్ ఇన్వాలిడేషన్ ఉద్యోగికి ఇన్వాలీడ్ పింఛను ఇస్తారు.
ఏ జబ్బుల వల్ల రిటైర్ కావచ్చు
♦ పక్షవాతం, అంతిమ దశలో ఉన్న మూత్రపిండాల రోగం, కాలేయ సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, మానసిక సంబంధిత వ్యా«ధి, తీవ్రమైన పార్కిన్సన్ జబ్బుకమిటీకి పంపవలసిన వివరాలు ఇలా
♦ మెడికల్ ఇన్వాలిడేషన్ కోరే ఉద్యోగి వివరాలు
♦ ఉద్యోగి పనిచేస్తున్న శాఖ, హోదా, జీతపు స్కేలు
♦ ఏదైనా క్రమశిక్షణ చర్యలు అపరిష్కృతంగా ఉన్నాయా
♦ ఉద్యోగి సర్వీసు క్రమబద్దీకరించబడిందా
♦ సర్వీసు రిజిస్టరు మేరకు పుట్టిన తేది
♦ వాస్తవంగా కాలపరిమితి మేరకు పదవీ విరమణ చేయు తేదీ
♦ పదవీ విరమణ కోరే ఉద్యోగికి ఉన్న రోగం ప్రభుత్వ ఉత్తర్వులు జీవో 661 తేదీ 23–1–2008లో తెలిపిన మేరకు కలిగియున్నదా
♦ ఉద్యోగి రోగ చికిత్స నిమిత్తం అతను/ఆమె మెడికల్ సెలవుపై ఉన్నారా, అయితే ఏ తేదీ నుండి అట్టి సెలవుపై చికిత్స నిమిత్తం ఉన్నారు.
♦ మెడికల్ బోర్డు సిఫార్సులు(ఒరిజినల్) జతపరిచాలి
♦ శాఖాపర విశ్లేషణ–సిఫార్సులు
Comments
Please login to add a commentAdd a comment