
వాన కోసం ఊరు ఖాళీ
- ఒకరోజు వలస వెళ్లిన గ్రామస్తులు
- గ్రామంలోకి ఎవరూ రాకుండా కాపలా
- పూజలు చేసిన బిరుదనపల్లె వాసులు
కుప్పం: వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ ఆ గ్రామ ప్రజలు ఒకరోజు వలస వెళ్లారు. సూర్యోదయానికి పూర్వమే ఊరు ఖాళీ చేశారు. గ్రామంలోకి ఎవరూ వెళ్లకుండా గేట్లు అడ్డుగా ఉంచారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలిమేరల్లో వంటావార్పుతో గడిపారు. 1963 నాటి రోజులను గుర్తు చేశారు.
ఇదీ మండలంలోని బిరుదనపల్లెలో ఆదివారం చోటు చేసుకున్న సంఘటన. దాదాపు వంద కుటుంబాలకు పైగా ఉన్న బిరుదనపల్లెలో మూడేళ్లుగా వర్షాలు లేక నీటి కో సం అల్లాడిపోతున్నారు. పశువులకు మేత కూడా కష్టం గా ఉంది. వింతరోగాలతో పశువులు మరణిస్తుంటే, ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. గ్రావూనికి ఏదో కీడు జరిగిందని భావించి శాంతి పూజలు చేసేం దుకు గ్రామస్తులంతా సిద్ధవుయ్యూరు.
1963లో కూడా ఇలాంటి శాంతి పూజలు చేసినట్టు తెలిపారు. ఆదివా రం ఉదయుం సూర్యోదయుం ముందే ఇళ్లకు తాళాలు వేసి పశువులు, కోళ్లను వెంట తీసుకుని వలసబాట పట్టారు. గ్రావు సమీపంలోని వూమిడితోపులోకి వెళ్లి అక్కడే ఉదయుం నుంచి సాయుంత్రం వరకు వంటవార్పులు చేపట్టారు.
వనభోజనాలు చేశారు. బిరుదనపల్లె గ్రావూనికి ఉన్న ఏడు ముఖ ద్వారాలను ముసివేసి గ్రావుంలోకి ఎవరినీ వెళ్లకుండా కాపలా కాశారు. సాయుంత్రం ఆరు గంటల అనంతరం గ్రావు పొలిమేరల్లో పూజలు జరిపి పొలిమేరల చుట్టూ అష్టబంధకం చేసి గ్రావుంలోకి ప్రవేశించారు. ఇలాంటి పూజల వల్ల గ్రామానికి పట్టిన కీడు వదులుతుందని, ప్రజలు సుఖ శాంతులతో జీవనం సాగిస్తారనే నవ్ముకాన్ని వెలిబుచ్చారు.
1963కు ముందు గ్రావుంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు వరుణ పూజలు, వలసబాటతో పూజలు చేయుడం వల్ల అప్పటినుంచి ఇప్పటివరకు గ్రావూనికి ఎలాంటి ఇబ్బంది కలగలేదని స్థానికులు తె లిపారు. 50 ఏళ్ల తర్వాత గ్రావుంలో ఏర్పడిన కరువు పరిస్థితులు తొలగిపోవాలని గ్రావుస్తులు ఏకనిర్ణయుం తో ఆదివారం పూజలు చేపట్టడం గవునార్హం.