రాజకీయాల నుంచి తప్పుకుంటా! | I will quit Politics if Parliament accepts the Telangana Bill | Sakshi
Sakshi News home page

రాజకీయాల నుంచి తప్పుకుంటా!

Published Thu, Jan 30 2014 1:57 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

రాజకీయాల నుంచి తప్పుకుంటా! - Sakshi

రాజకీయాల నుంచి తప్పుకుంటా!

  • ఇదే బిల్లును పార్లమెంటు ఆమోదిస్తే.. 
  •  కేంద్రాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి వ్యాఖ్యలు
  •  ప్రశ్న: బిల్లును తిరస్కరించాలంటూనే.. చర్చకు
  •   అదనపు సవుయుం కోరడంలోని ఔచిత్యమేమిటి? 
  •  కిరణ్: సభలో 86 వుంది సభ్యుల అభిప్రాయూలే ఇప్పటివరకు వచ్చారుు. వీటితోనే రాష్ట్ర విభజన చేయుడం ఔచిత్యవూ? 9,024 సవరణలు వచ్చారుు. వాటిపై చర్చ సంగతేమిటి? అందుకే అదనపు సమయం కోరాం. 
     
     ప్రశ్న: చర్చకు ఇచ్చిన గడువు అంతా వుుగిశాక బిల్లులో లోపాలున్నాయుని ఎలా అంటారు? 
     కిరణ్: ఇప్పటివరకూ బిల్లును పరిశీలించేంత సవుయుం దొరకలేదు. బిల్లు వచ్చినప్పుడు ఒక్క రోజు గడవకవుుందే అసెంబ్లీకి సవుర్పించినా కూడా.. ఆలస్యం చేశారంటూ వివుర్శలు చేశారు. ఇక అందులో లోపాలను పరిశీలించడానికి సవుయుం ఎక్కడ ఇచ్చారు? 
     
     సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీకి పంపిన బిల్లునే కావూలు, ఫుల్‌స్టాప్‌లు వూర్చకుండా యుథాతథంగా పార్లమెంటులో పెట్టి ఆమోదించుకోగలిగితే.. తాను రాజకీయూల నుంచి తప్పుకుంటానని వుుఖ్యవుంత్రి ఎన్.కిరణ్‌కువూర్‌రెడ్డి పేర్కొన్నారు. తప్పులతడకల బిల్లును పంపి కేంద్ర హోంశాఖ చివరకు రాష్ట్రపతిని సైతం మోసం చేసిందని దుయ్యుబట్టారు. రాష్ట్ర అసెంబ్లీతో సంబం ధం లేకుండా విభజన చేసుకునే అధికారం కేంద్రానికి ఉందనుకుంటే అలాగే చేసుకోవచ్చని.. దమ్ముంటే ఆమోదించుకోమని,  ఆ తరువాత తామేం చేయూలో అది చేస్తావుని వ్యాఖ్యానిం చారు. సీఎం బుధవారం అసెంబ్లీలోని తన చాంబర్లో మీడియూతో ఇష్టాగోష్టిగా వూట్లాడారు. శాసనసభలో బిల్లుపై సభ్యులందరి అభిప్రాయాలూ చెప్పాల్సి ఉందని, సవరణలపైనా చర్చించాల్సి ఉందని.. అందుకే మరింత అదనపు గడువు కోరానని మిగతా  ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బిల్లును తిరస్కరించాలంటూ తీర్మానం నోటీసు ఇచ్చే అధికారం సీఎంగా తనకు ఉందని.. ఈ విషయాన్ని కేబినెట్‌లో చర్చించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తన నిర్ణయూలు నచ్చని వుంత్రులు కేబినెట్ నుంచి తప్పుకోవచ్చని వ్యాఖ్యానించారు. బిల్లుకు సంబంధించి సీఎం కిరణ్ చెప్పిన ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... 
     
     వారి అభిప్రాయాలు చెప్పలేదు: ప్రస్తుతం వచ్చిన బిల్లులో కేంద్రం ఏం చేయుదల్చుకుందో ఏ అభిప్రాయూలు లేవు. వారి అభిప్రాయాలేమిటో చెప్పకుండా రాష్ట్ర అభిప్రాయమెలా కోరుతారు? విభజనకు కారణాలు, ప్రయోజనాల గురించి బిల్లులో పొందుపరచలేదు. విభజన వల్ల అయ్యే ఖర్చును కేంద్రం భరిస్తుందా? రాష్ట్రమే భరిస్తుందా? ఇవేవీ లేకుండానే అసెంబ్లీ అభిప్రాయుం చెప్పటం సాధ్యవూ? 
     
     నేను చాలెంజ్ చేస్తున్నా..: ఈ బిల్లు సవుగ్రంగా ఉందని కేంద్రవుంత్రులు, ఇతర పెద్దలెవరైనా చెప్పగలరా? నేను చాలెంజ్ చేస్తున్నాను. సవుగ్రమైనదనే కేంద్రం భావిస్తే ఇదే బిల్లును యుధాతథంగా పార్లమెంటులో ప్రవేశపెట్టగలదా? ఇదే బిల్లును పార్లమెంటులో పెట్టవునండి. అది ఆమోదం పొందితే నేను రాజకీయూల నుంచి తప్పుకుంటా. ఒరిజిన్ బిల్లు ఇదే అరుుతే పెట్టవునండి. 
     
     చదువుకుని మాట్లాడాలి..: ఈ బిల్లు పార్లమెంటులో అడ్మిట్ కానే కాదు. (కేంద్ర వుంత్రి కిశోర్ చంద్రదేవ్‌ను ఉద్దేశించి) వుుసారుుదా బిల్లు, బిల్లు అంటే ఏమిటో ప్రభుత్వ రికార్డుల్లో రాజ్యాంగం, పార్లమెంటు పుస్తకాల్లో స్పష్టంగా ఉంది.. చదువుకొని వూట్లాడితే వుంచిది. రాష్ట్రపతికి పంపే బిల్లు ఏదైనా సమగ్రంగా, తప్పులు లేకుండా ఉండాలి. బిల్లును మీరు (విలేకరులు) రూపొందించినా పార్లమెంటు ఆమోదానికి వీలుగా ఉండేది. 
     
     ఎందుకు అడ్డుకుంటున్నారు..: శాసనసభకు అధికారం లేదని, రాష్ట్ర విభజనపై కేంద్రానికే అధికారవుుందని చెప్తున్న వారు.. అసెంబ్లీలో నేను ప్రవేశపెట్టదల్చుకున్న తీర్మానాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? కేంద్రానికే అధికారం ఉన్నప్పుడు అసెంబ్లీకి బిల్లును ఎందుకు పంపారు? 
     
     నచ్చని మంత్రులు తప్పుకోవచ్చు..: బిల్లును తిరస్కరిస్తున్నావునే తీర్మానం కోరుతున్నాం. దీనిపై గురువారం సభలో నేను స్పీకర్‌ను అడుగుతా. నేను సభానాయుకుడిగా, సీఎంగానే రూల్ 77 కింద నోటీసు ఇచ్చా. సీఎంగా నాకా అధికారం ఉంది. కేబినెట్లో పెట్టాల్సిన అవసరం లేదు. నా నిర్ణయూలు నచ్చని వుంత్రులు కేబినెట్ నుంచి తప్పుకోవచ్చు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement