
ఇబ్బందులపై కేంద్రానికి లేఖ రాస్తా
నోట్లమార్పిడిపై టెలీకాన్ఫరెన్‌సలో ముఖ్యమంత్రి చంద్రబాబు
సాక్షి, అమరావతి: నోట్ల మార్పిడికి సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి లేఖ రాయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా బ్యాంకులు, తపాలా కార్యాలయాల వద్ద తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.
పెద్ద నోట్ల రద్దు వల్ల రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఆదివారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఆయన అధికారులతో టెలీకాన్ఫరెన్‌సలో మాట్లాడారు. నోట్ల రద్దు తర్వాత ఏర్పడిన పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఆర్థిక శాఖ, సివిల్ సప్లరుుస్, సమాచార శాఖ ఉన్నతాధికారులతో ఒక కమిటీని నియమించినట్లు సీఎం చెప్పారు.