ప్రకాశం జిల్లాలో విషాదం
Published Fri, Jun 9 2017 11:12 AM | Last Updated on Tue, Sep 5 2017 1:12 PM
పెద్దచెర్లోపల్లి: ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని పెద్దచెర్లోపల్లి మండలం అలవలపాడు గ్రామంలో ఇద్దరు పిల్లలు సహా ఓ తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన దోతిరెడ్డి కృష్ణవేణి(32) భర్త ఏడేళ్ల క్రితం మృతిచెందాడు. దీంతో తల్లిదండ్రుల వద్దే ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా మనోవేదనకు గురవుతోంది.
గురువారం రాత్రి తన ఇద్దరు కుమారులు మదన్(12), మనీష్(9)లతో కలిసి గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement