తెయూ(డిచ్‌పల్లి), న్యూస్‌లైన్ : అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చితే మన దేశంలో గ్రామీణ ప్రాంతాలలో ఉన్నత విద్యావంతుల శాతం తక్కువని యూజీసీ మాజీ చైర్మన్, ఐసీఎస్‌ఎస్‌ఆర్ చైర్మన్ సుఖ్‌దేవ్ తోరట్ పేర్కొన్నారు. గ్రామాల లో ఉన్నత విద్యనభ్యసించేవారి సంఖ్య పెరగాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ యూనివర్సిటీలోని కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ భవనంలో బుధవా రం నిర్వహించిన తొలి స్నాతకోత్సవానికి ఆయన ము ఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా దేశంలో 18 నుంచి 22 ఏళ్ల వయసువారే ఉన్నత విద్య అభ్యసిస్తున్నారన్నారు. వీరిలో వెనుకబడిన వర్గాల వారు ఉన్నత విద్యను ఎంచుకోకుండా ఉపాధికి సంబంధించిన ఇతర విద్యావకాశాలు వెతుక్కుంటున్నారని పేర్కొన్నారు.
ఉన్నత విద్యారంగంపై మతాలు, కులాలు, ధనవంతులు, పేదలు అనే పలు రకాల అంశాలు ప్రభావం చూ పుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఉన్నత విద్యారంగంలో హిందువులు 21 శాతం, ముస్లింలు 16 శాతం, క్రిస్టియన్‌లు 15 శాతం ఉన్నారని తోరట్ పేర్కొన్నారు. హిం దువుల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల శాతం పెరగాల్సి ఉందన్నారు. పట్టణ ప్రాంతాల్లోకంటే గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల నమోదు 35 శాతం తక్కువగా ఉందని, ఇందులో మహిళల నమోదు శాతం మూడోవంతేనని పేర్కొన్నారు. ఆంగ్లమాధ్యమంలో ఉన్నత విద్యనభ్యసిస్తున్న వారిలో పట్టణ ప్రాంతాల్లో 78 శాతం, గ్రామీణప్రాంతంలో 22 శాతం ఉన్నారన్నారు. ఈ అంశం ప్రజల జీవనోపాధులపై ప్రభావం చూపుతోందన్నారు. ఆంగ్ల మాధ్యమం అంటే భయపడవద్దని విద్యార్థులకు సూచించారు.
గ్రామాలలో విద్యావంతులు పెరగాలి
Published Thu, Nov 14 2013 3:50 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement