దక్షిణాఫ్రికాపై భారత్ విజయంతో మిన్నంటిన ఆనందం
కప్ గెలుపుపై పెరిగిన ఆశలు
అమలాపురం : ‘భారత్ అభిమానులు టీవీలో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ చూస్తున్నారు. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీస్తే ఇద్దరు దక్షిణాఫ్రికా అభిమానులు బాణసంచాతో కనిపించారు. ఈసారి సగటు భారతీయ అభిమాని వారిని చూసి సిగ్గుపడలేదు. తిరిగి వెళ్లమనలేదు. ఆ బాణసంచా తీసుకుని తనివితీరా కాల్చారు’. ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌లూ ఓడిపోవడంపై స్టార్‌స్పోర్ట్స్ చానల్ వ్యంగ్యంగా రూపొందించిన యాడ్ ఇది. ఈ యాడ్ ఇక నుంచి ప్రసారం చేసే అవకాశం లేదు. ఎందుకంటే.. వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికాపై భారత్‌జట్టు గెలిచింది. లీగ్ మ్యాచ్‌లలో భాగంగా ఆదివారం భారత్- దక్షిణాఫ్రికా తలపడగా భారత్ ఘన విజయం సాధించింది. ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై గెలుపు ఇదే తొలిసారి. లీగ్ దశలో పెద్దజట్లయిన పాకిస్తాన్, దక్షిణాఫ్రికాలపై ఘన విజయంతో భారత జట్టు సెమీస్‌కు సునాయాసంగా వెళ్లనుందని క్రికెట్ అభిమానులు పొంగిపోతున్నారు. గెలుపుపై వారి ఆనందాన్ని ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు...
సెమీస్‌కు అవరోధాల్లేవు
మన జట్టు సెమీ ఫైనల్స్‌కి వెళ్లడం ఖాయం. మన గ్రూప్‌లోని రెండు పెద్దజట్లు పాకిస్తాన్, దక్షిణాఫ్రికాలపై ఇండియా గెలవడం చాలా ఆనందంగా ఉంది. మిగిలిన వాటిలో ఒక్క వెస్టిండీస్ తెప్ప పెద్ద జట్లు లేవు. మనం మెరుగైన రన్‌రేట్‌తో ఉన్నందున సెమీస్‌కు ఢోకా లేదు.
- వీరా సతీష్, క్రికెట్ క్రీడాకారుడు, అంబాజీపేట.
ఈ విజయాలు ఊహించలేదు
ప్రపంచకప్ పోటీల్లో మనం గతంలో చిన్న జట్ల మీద కూడా ఓడిపోయాం. అటువంటిది పాకిస్తాన్, దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్ల మీద భారీ తేడాతో విజయం సాధించడం అభినందనీయం. మన జట్టు ఇంతగా రాణిస్తుందని ఊహించలేదు. ఇదే స్ఫూర్తితో ఆడితే మరోసారి ప్రపంచకప్ గెలుస్తాం.
- మచ్చా సత్తిబాబు, క్రికెట్‌కోచ్, మామిడికుదురు.
ఫైనల్స్‌కు చేరుతాం
సౌత్‌ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీంఇండియా అద్భుతంగా ఆడింది. జట్టు సమష్టిగా రాణించడంతో ఈ విజయం సొంతమైంది. గత మ్యాచ్‌లలో ఎప్పుడూ వరల్డ్‌కప్‌లో టీమ్ ఇండియా దక్షిణాఫ్రికాపై గెలవలేదు. అయితే ఈ సారి గెలవడం చూస్తే మన జట్టు వరల్డ్‌కప్ ఫైనల్స్‌కు చేరుతుందనే నమ్మకం కలిగింది.
- ఎం.ఎస్.జోయల్‌రాజు, పిఠాపురం.
మనవాళ్లు అద్భుతంగా ఆడారు
టీంఇండియా సౌత్‌ఆఫ్రికాపై జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా ఆడింది. వరల్డ్‌కప్‌లో సౌత్‌ఆఫ్రికాపై ఇండియా విజయం సాధించలేదనే అపోహను మన జట్టు చెరిపేసింది. పాకిస్థాన్, సౌత్ ఆఫ్రికాలపె గెలవడం ద్వారా వరల్డ్ కప్ సాధిస్తామనే నమ్మకం కలిగింది. - టి.వి.సిరిల్, ఉద్యానవనశాఖ అధికారి.
కట్టలు తెగిన క్రీడోత్సాహం
Published Mon, Feb 23 2015 1:17 AM | Last Updated on Sat, Sep 2 2017 9:44 PM
Advertisement
Advertisement