సర్కారు ఉల్లి కిలో రూ. 30
Published Wed, Aug 28 2013 3:04 AM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM
కలెక్టరేట్ : సామాన్యులకు ఉల్లిని అందుబాటు ధరలో అందించడానికి విక్రయ కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు ఇన్‌చార్జి కలెక్టర్ హర్షవర్ధన్ తెలిపా రు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్ రైతు బజారులో ప్రభుత్వం తరపున ఉల్లిగడ్డ విక్రయ కేంద్నాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహిరంగ మార్కెట్‌లో ఉల్లిని కిలో రూ. 50 వరకు విక్రయిస్తున్నారన్నారు.
ఈ కేంద్రాల ద్వారా 30 రూపాయలకే కిలో ఉల్లి అందిస్తున్నామని పేర్కొన్నారు. పులాంగ్ చౌరస్తాలోని రైతు బజారులో కూడా ఈ కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. డిమాండ్‌ను బట్టి కామారెడ్డి, బోధన్, ఆర్మూర్‌లలో కూడా ఉల్లి విక్రయ కేంద్రాలు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ కొండల్‌రావు, డీఎంసీఎస్ దివాకర్, మార్కెటింగ్ ఏడీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement