ఇందిర జలభ్రమ | Indira jala bhrama scheme not implemented | Sakshi
Sakshi News home page

ఇందిర జలభ్రమ

Published Sun, Dec 8 2013 5:12 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 AM

Indira jala bhrama scheme not implemented

సాక్షి, కరీంనగర్ : 2011-12లో జిల్లాకు ఈ పథకం మంజూరయ్యంది. జిల్లావ్యాప్తంగా మూడేళ్లలో 31వేల ఎకరాలను అభివృద్ది చేసి నీటి వసతి కల్పించాలని నిర్ణయించారు. ఇందుకోసం 11 కోట్ల 46 అక్షల రూపాయలతో అంచనాలను రూపొందించారు. లబ్దిదారుల ఎంపిక దగ్గర నుంచి అన్నింటా తీవ్ర జాప్యం జరుగుతుండడం వల్ల  పథకం నత్తనడక నడుస్తోంది. అభివృద్ది చేసేందుకు   989 బ్లాకులలో 10570 ఎకరాల భూమిని గుర్తించారు. 4888 మంది ఎస్‌సి, 1421 ఎస్‌టి లబ్దిదారులకు  చెందిన ఈ భూములను అభివృద్ధి పరిచేందుకు ఆరు కోట్ల 67 లక్షల అంచనాలతో 1058 పనులను మంజూ రు చేశారు. 833 బ్లాకుల్లో 8904 ఎకరాలకు సంబంధించి భూగర్భజల సర్వే పూర్తి చేశారు.

వివిధ కారణాలతో  4333 ఎకరాల విస్తీర్ణం ఉన్న 397 బ్లాకులలో పనులను రద్దు చేశారు. మిగిలిన బ్లాకులలో   బోర్లు, ఓపెన్‌బావులు,  విద్యుదీకరణ, మోటార్ల ఏర్పాటు తదితర పనులు చేపట్టి ఇంతవరకు రెండు కోట్ల 64 లక్షలు ఖర్చు చేశారు. ఇద్దరు, అంతకన్నా ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ రైతులు బృందంగా ఏర్పడి, ఐదెకరాలకు మించి ఒకేచోట భూమి చూపితేనే ఈ పథకం కింద లబ్ది పొంద  లుగుతారు. ఈ నిబంధన లబ్ధిదారుల ఎంపికలో సమస్యగా మారుతోందన్న వాదన ఉంది.  ఇప్పటి వరకు 237 బోర్లు మాత్రమే వేయగా ఇందులోనూ 43 విఫలమయ్యాయి.

 వీటి కింద 1859 ఎకరాలు మాత్రమే సాగులోకి వస్తాయి. సాగునీటి వసతుల కల్పనలో తీవ్ర జాప్యం జరుగుతుండగా విద్యుదీకరణలో కూడా పురోగతి కనిపించడంలేదు. 183 వనరుల విద్యుదీకరణ కోసం ప్రతిపాదనలు సిద్దం చేయగా 113 పంపుసెట్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం కాల పరిమితి 1014 మార్చిలో పూర్తికానుంది. ఇప్పటి వరకు అరకొరగానే పనులు జరిగినందున మిగిలిన 15 నెలల్లో లక్ష్యాన్ని పూర్తి చేయడం సాధ్యమవుతుందా అన్న సందేహం వ్యక్తమవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement