ఇందిరమ్మ ఇళ్లకు సిమెంట్ కొరత | indiramma housing Cement shortage | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ ఇళ్లకు సిమెంట్ కొరత

Published Sun, Dec 1 2013 2:51 AM | Last Updated on Sat, Sep 2 2017 1:08 AM

indiramma housing Cement shortage

 విజయనగరం ఫోర్ట్, న్యూస్‌లైన్ : పేదోడి సొంతింటికలకు సిమెంట్ కొరత అవరోధంగా మారింది. మూడు నెలలుగా సిమెంట్ సరఫరా నిలిచిపోవడంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను మధ్యలోనే ఆపివేశారు. జిల్లాకు ఇందిరమ్మ ఫేజ్ 1, 2,3లతో పాటు రచ్చ బండ మొదటి, రెండో విడతలో వచ్చిన దరఖాస్తుల మేరకు 3. 65 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో ప్రస్తుతం 50 వేల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. అయితే మూడు నెలలుగా సిమెంట్ సరఫరా నిలిచిపోవడంతో లబ్ధిదారులు నిర్మాణాలను మధ్యలోనే నిలిపి వేశారు. గృహ నిర్మాణ శాఖ అధికారులు జిల్లాకు 8, 900 టన్నుల సిమెంట్ అవసరమని ప్రతిపాదనలు పంపించగా ఇంతవరకు సర ఫరా కాలేదు. ఇందిరమ్మ, రచ్చబండ ఇళ్లకు సిమెంట్‌ను మూడు విడతలుగా ఇస్తారు. పునాదులు వేసిన తర్వాత 20 బస్తాలు, రూప్ లెవల్‌కు వచ్చిన తర్వాత 20 బస్తాలు, శ్లాబు వేసిన తర్వాత 10 బస్తాలు చొప్పన మంజూరు చేస్తారు. సిమెంట్ బస్తాలకు డబ్బులు  మినహాయించి బిల్లు చెల్లిస్తారు. అరుుతే సిమెంట్ సరఫరా నిలిచిపోవడానికి ధర పెరుగుదలే కారణమని తెలుస్తోంది.
 
 గతంలో రూ. 170 నుంచి రూ. 180 చొప్పున బస్తాలను సిమెంట్ పరిశ్రమలు సరఫరా చేసేవి. ప్రస్తుతం ధర పెరగిపోవడంతో పరిశ్రమలు సర ఫరా నిలిపివేసినట్టు సమాచారం. ప్రస్తుతం మార్కెట్‌లో బస్తా సిమెంట్ ధర రూ. 300 నుంచి రూ. 330 వరకు ఉంది. దీంతో  ప్రస్తుతం చెల్లిస్తున్న ధరకు అదనంగా రూ. 50 నుంచి రూ. 60 పెంచితే గాని సరఫరా చేయలేమని సిమెంట్ పరిశ్రమలు తెగేసి చెబుతున్న ట్టు భోగట్టా.  దీంతో ప్రభుత్వం ఎటు తెల్చకుండా చోద్యం చూస్తోంది. అందువల్లే గృహానిర్మాశాఖ అధికారులు ప్రతిపాదనలు చేసి నా.. పరిశ్రమలు సిమెంట్ సరఫరా చేయడం లేదు. ఈ విషయమై గృహానిర్మాణశాఖ పీడీ యు.కె.హెచ్.కుమార్ వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా జిల్లాకు 8900 సిమెంట్ సరఫరా అవసరమని ప్రతిపాదనలు పంపించాం. త్వరలో వచ్చే అవకాశం ఉందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement