
ఐసీడబ్ల్యూఏలో మెరిసిన తెలుగు తేజాలు
కోల్‌కతాలోని ఐసీడబ్ల్యూఏ చాప్టర్ సోమవారం ప్రకటించిన ఇంటర్, ఫైనల్ పరీక్ష ఫలితాల్లో తెలుగు తేజాలు మెరిశాయి.
ఇంటర్, ఫైనల్‌లో ఫస్ట్‌ర్యాంకర్లు తెలుగువారే
ఇద్దరూ కృష్ణాజిల్లాకు చెందిన వారే
విజయవాడ (లబ్బీపేట): కోల్‌కతాలోని ఐసీడబ్ల్యూఏ చాప్టర్ సోమవారం ప్రకటించిన ఇంటర్, ఫైనల్ పరీక్ష ఫలితాల్లో తెలుగు తేజాలు మెరిశాయి. ఆలిండియా ఫస్ట్ ర్యాంకర్లిద్దరూ తెలుగువారే కాగా, ఇద్దరూ కృష్ణా జిల్లాకు చెందిన వారే కావడం విశేషం! వారిద్దరూ విజయవాడలోని సూపర్‌విజ్‌లో శిక్షణ పొందారు. సూపర్‌విజ్ కార్యాలయంలో విలేకరులకు ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. డిసెంబరు 2015లో నిర్వహించిన ఐసీడబ్ల్యూఏ ఇంటర్, ఫైనల్ పరీక్ష ఫలితాల్లో తమ విద్యార్థులు సత్తాచాటినట్లు తెలిపారు.
ఐసీడబ్ల్యూఏ ఫైనల్‌లో కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన కంతేటి ఉపేంద్ర ఆలిండియా స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించగా, 50లోపు మరో 8 ర్యాంకులు పొందినట్లు తెలిపారు. ఇంటర్‌లో కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన కొణిజేటి సాయిశ్రీలక్ష్మి ఆలిండియా స్థాయిలో మొదటిర్యాంకు సాధించగా, చిత్తూరు జిల్లా చోడవరానికి చెందిన నాగోలు మోహన్‌కుమార్ రెండో ర్యాంకు. అదే జిల్లా రామసముద్రానికి చెందిన యల్లంపల్లి లతశ్రీ మూడో ర్యాంకు సాధించినట్లు తెలిపారు. ఇప్పటివరకూ సూపర్‌విజ్ 49 సార్లు ఆలిండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి రికార్డు సృష్టించిందన్నారు.