ఏలూరు సిటీ : ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రథమ సంవత్సరం ఇంటర్ విద్యార్థులకు బుధవారం సంస్కృతం, హిందీ, తెలుగు పేపరు-1 పరీక్షలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 103 పరీక్షా కేంద్రాల్లో 34,093 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 31,953 మందే పరీక్షలు రాశారు. వివిధ కారణాలతో 2,140 మంది పరీక్షలు రాయలేదు. జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ జరగలేదని ఇంటర్మీడి యెట్ విద్యామండలి ప్రాంతీయ పర్యవేక్షణాధికారి బి.వెంకటేశ్వరరావు తెలిపారు.
కేంద్రాల వద్ద రద్దీ
పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు, బంధువులు రావడంతో ఆ ప్రాంతాలన్నీ రద్దీగా మారిపోయాయి. అర్ధగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు చెప్పడంతో 90 శాతానికి పైగా విద్యార్థులు ఆ విధంగానే చేరుకున్నారు. ఏలూరు ఆర్‌ఆర్‌పేటలోని సెయింట్ థెరిస్సా జూనియర్ కళాశాలలో ఇద్దరు అంధ విద్యార్థులు సహాయకులతో పరీక్షలు రాశారు. ఎండ తీవ్రంగా ఉండటంతో పరీక్షా కేంద్రాల వద్ద ఉన్న చెట్ల కింద విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు పరీక్ష పూర్తయ్యేంత వరకు నిరీక్షించారు. నగరంలోని కొన్ని పరీక్షా కేంద్రాల్లో సరైన సౌకర్యాలు ఏర్పాట్లు చేయలేదని ఆరోపణలు వచ్చాయి.
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
Published Thu, Mar 12 2015 4:33 AM | Last Updated on Sat, Sep 2 2017 10:40 PM
Advertisement