మార్చి 11 నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షలు మార్చి 11 నుంచి 31 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు 9,90,912 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. జనరల్ కేటగిరిలో 9,33,308 మంది, ఒకేషనల్‌లో 57,604 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. దీని కోసం ఇంటర్మీడియెట్ విద్యా బోర్డు 1,411 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 12 నుంచి మార్చి 3 వరకు జరగుతాయి. ఈ పరీక్షలకు 2,90,380 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
దీని కోసం 1,723 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. మొదటి సంవత్సరానికి సంబంధించి ఈ నెల 28న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు నీతిశాస్త్రం, 31న పర్యావరణ విద్యపైన పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది.