కలికిరి(చిత్తూరు), న్యూస్‌లైన్ : అమ్మారు అనంతపురం జేఎన్‌టీయూ కళాశాల విద్యార్థిని, అబ్బాయి బెంగళూరులో ఆర్మీలో ఉద్యోగం. ఇంటర్నెట్ సాయంతో ఇరువురూ ప్రేమించుకున్నారు. ఫేస్‌బుక్‌లో మనసులు కలిశాయి. పెద్దల ప్రమేయం లేకుండా ప్రేమ వివాహం చేసుకుని పోలీసులను ఆశ్రయించడంతో కథ సుఖాంతమైంది.
వివరాలిలా ఉన్నాయి. కలికిరి మండలం మేడికుర్తి పంచాయతీ పసలవాండ్లపల్లెకు చెందిన ఎం.సహదేవయ్య కుమారుడు మహేంద్ర బెంగళూరులో ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. అనంతపురం జిల్లా ధర్మవరం కేశవనగర్‌కు చెందిన సత్యనారాయణ కుమార్తె ఎస్.రాజరాజేశ్వరి జేఎన్‌టీయూ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఇరువురూ ఇంటర్నెట్ ద్వారా రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. ఫేస్‌బుక్‌లో ఇద్దరి మనసులూ కలవ డంతో రెండు రోజుల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు.
పెద్దల నుంచి తమకు రక్షణ కల్పించాలని ఆదివారం మదనపల్లె డీఎస్పీని కలిశారు. ఆయన సూచనల మేరకు కలికిరి పోలీసులను ఆశ్రయించారు. ఎస్‌ఐ. సోమశేఖర్‌రెడ్డి సోమవారం ఇరు కుటుంబాల పెద్దలను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ చేశారు. తామిద్దరం మేజర్లమని, ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రేమికులిద్దరూ తెలిపారు. ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో కొత్త జంట పసలవాండ్లపల్లెకు వెళ్లింది. మంగళవారం ధర్మవరం బయలుదేరింది.
ఇంటర్నెట్ ప్రేమ పెళ్లి
Published Wed, Oct 2 2013 3:06 AM | Last Updated on Fri, Jul 27 2018 12:33 PM
Advertisement