
ఐపీఎస్‌ల ఆత్మీయ సమ్మేళనం
ప్రతి నిత్యం విధి నిర్వహణలో బిజీ బిజీగా ఉండే ఐపీఎస్ అధికారులు తమ కుటుంబ సభ్యులతో ఆదివారం రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల పరిధిలోని ప్రగతి రిసార్ట్స్‌కు తరలివచ్చారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో డీజీపీ ప్రసాద్‌రావు, హోంశాఖ కార్యదర్శి టీపీ దాసు, అడిషనల్ డీజీపీ కౌముదిలతో పాటు అనురాధ, సురేంద్రబాబు, గౌతమ్‌సవాంగ్, సీవీ ఆనంద్, అతుల్‌సింగ్, అమిత్‌గార్గ్, గోవింద్‌సింగ్ తదితర 15 మంది ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రిసార్‌ట్సలో తమ కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడిపారు. - న్యూస్‌లైన్, శంకర్‌పల్లి