మోర్తాడ్, న్యూస్‌లైన్: నిజామాబాద్-పెద్దపల్లి రైల్వేలైన్ నిర్మాణంలో కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలను పాటించకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా రైలు ట్రయల్ రన్ కూడా జరుగక ముందే పట్టాలు విరిగిపోతున్నాయి. రైల్వేలైన్‌కు వినియోగిస్తున్న ఇనుములో నాణ్యత లేకపోవడంతో పట్టాల మధ్య పగుళ్లు చోటు చేసుకుం టున్నాయి.
రైలు పట్టాల మధ్య పగుళ్లు ఏర్పడితే భవిష్యత్తులో రైలు ప్రయాణం భద్రమేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ లైన్ పనులు మోర్తాడ్ ప్రాంతంలో కొనసాగుతున్నాయి. వీటిని పర్యవేక్షించాల్సిన అధికారులు కాం ట్రాక్టర్లకే వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బద్దంవాడ వ్యవసా య క్షేత్రాల పరిసరాలలో రైల్వే లైన్ పనులు పూర్తి అయ్యాయి. స్టేషన్ పరిసరాలలో చిన్న చిన్న పనులు పూర్తి కావాల్సి ఉన్నందున రైలు ఇంజిన్ ట్రయల్ రన్‌ను వాయిదా వేశా రు.
షెడ్యూల్ ప్రకారం గడచిన జూన్ నుంచి జగిత్యాల్, మోర్తాడ్ మధ్య ప్యాసింజర్ రైలును నడుపాల్సి ఉంది. పనులు వేగంగా సాగక పోవడంతో అది సాధ్యం కాలేదు. రైల్వే లైన్ పట్టాలకు వినియోగిస్తున్న ఇనుము విషయంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పట్టాలు విరి గిపోతున్నాయి. దీంతో రైలు ప్రమాదాలు సంభవిం చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు
ఆందోళన చెందుతున్నారు. రైలు ఇంకా పట్టాలు ఎక్కక ముందే పరిస్థితి ఇలా ఉంటే, రైలు వచ్చిన తరువాత పరిస్థితి ఎలా ఉంటుందోనని వారు సంశయిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైల్వే లైన్ నిర్మాణం విషయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
అప్పుడే విరుగుతున్న పట్టాలు
Published Wed, Jan 29 2014 2:48 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement