పట్టిసీమపై చర్చకు బాబు సిద్ధమా: బొత్స
పట్టిసీమ ప్రాజెక్టుతో రాయలసీమ జిల్లాలకు ఒక్క చుక్క నీరు కూడా రాదని పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ అన్నారు. అనంతపురంలో ఆయన మరో మాజీ మంత్రి శైలజానాథ్తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పట్టిసీమపై బహిరంగ చర్చకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధమా అని బొత్స ప్రశ్నించారు.
సమన్యాయం పేరుతో చంద్రబాబు రాష్ట్ర విభజనకు అనుకూలంగా వ్యవహరించారని మరో కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఇప్పుడు చెబుతున్న బాబు.. మరి కేంద్రంలోని మంత్రివర్గంలో ఎలా కొనసాగుతున్నారని ఆయన ప్రశ్నించారు.