'చంద్రబాబు నేరుగా అవినీతికి పాల్పడుతున్నారు' | botsa satyanarayana takes on chandra babu naidu over ap capital | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు నేరుగా అవినీతికి పాల్పడుతున్నారు'

Published Fri, Feb 27 2015 1:24 PM | Last Updated on Fri, Jul 12 2019 3:10 PM

'చంద్రబాబు నేరుగా అవినీతికి పాల్పడుతున్నారు' - Sakshi

'చంద్రబాబు నేరుగా అవినీతికి పాల్పడుతున్నారు'

హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాలన జరగడం లేదని, రాజకీయ వ్యాపారమే జరుగుతోందని ఆయన ఆరోపించారు. శుక్రవారం బొత్స సత్యనారాయణ ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ చంద్రబాబు నేరుగా అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. జపాన్, సింగపూర్కు వెళ్లి ఎవరితో మాట్లాడారో పరిశీలిస్తే ఆయన జైలుకు వెళ్లక తప్పదని బొత్స అన్నారు.

చంద్రబాబుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఇప్పటివరకూ విచారణ జరగలేదని, విచారణ జరగకుండా ఆయన స్టే తెచ్చుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో పారదర్శకత లోపించిందన్నారు. విచారణ జరిపితే చంద్రబాబు దందాలు, వ్యాపారాలు అన్ని బయటకు వస్తాయని బొత్స వ్యాఖ్యానించారు. కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నా ...చంద్రబాబు కేంద్రాన్ని ఒక్కమాట కూడా అడగడం లేదన్నారు. ప్రజా ధనాన్ని దోచుకునేందుకే పట్టిసీమ ప్రాజెక్ట్ను చేపడుతున్నారన్నారు. సాంకేతికంగా ఆ ప్రాజెక్ట్ సాధ్యం కాదని బొత్స సత్యనారాయణ అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుందనే పట్టిసీమ చేపడుతున్నామంటూ ప్రజలను మోసం చేస్తున్నారని చంద్రబాబును బొత్స దుయ్యబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement