
సాక్షి, హైదరాబాద్: తిరుమల, తిరుపతి దేవస్థానాలతో పాటు, ఆ దేవస్థానాల ఆర్థిక సాయంతో నడిచే ఏ దేవాలయాలు, ఇతర సంస్థల్లోనూ హిందూయేతరులను ఏ పోస్టుల్లో కూడా నియమించడానికి వీల్లేదంటున్న టీటీడీ ఉద్యోగుల సర్వీసు నిబంధనల్లో రూల్ 9(4)ను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ రూల్ ను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించడంతో పాటు, ఈ రూల్ కింద హిందూ యేతరులమైన తమకు టీటీడీ జారీ చేసిన షోకాజ్ నోటీసులను రద్దు చేయాలని కోరుతూ టీటీడీ పరిధిలో వివిధ పోస్టుల్లో పనిచేస్తున్న 36 మంది క్రిస్టియన్, ముస్లిం ఉద్యోగులు పిటిషన్‌ను వేశారు.
ఇందులో దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ ఈవోలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యంపై తాత్కాలిక ప్రధాన న్యాయ మూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్ లతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. ప్రభుత్వంపై ఆధారపడి టీటీడీ పనిచేయడం లేదని, ఆ సంస్థకు స్వతంత్ర ప్రతిపత్తి ఉందని పిటిషనర్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment