అరకులోయలో జగన్నినాదం
వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి పేరుచెబితే సోనియా గాంధీ, చంద్రబాబుకు భయం పుడుతుందని ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడు దాడి వీరభద్రరావు అన్నారు. గురువారం అరకులోయలో నియోజకవర్గం సమన్వయకర్త కుంభా రవిబాబు ఆధ్వర్యంలో జరిగిన భారీ సమైక్య శంఖారావం సభలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్‌సీపీని ఓడించాలన్నఉద్దేశంతో కాంగ్రెస్, టీడీపీలు రాష్ట్ర విభజనకు ఒడిగట్టాయన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి వెలుగు రేఖలు నిండుతాయన్నారు. సభకు వేల సంఖ్యలో గిరిజనం తరలిరావడంతో అరకులోయ జనసంద్రమైంది. కార్య క్రమంలో నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణాదాస్, బొబ్బిలి పార్లమెంట్ ఇన్‌చార్జ్ బేబీ నాయన తదితరులు మాట్లాడారు.
- న్యూస్‌లైన్, అరకులోయ