వైఎస్సార్‌సీపీ నేత దాడి వీరభద్ర రావు
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకోవాలని టీడీపీ నేతలనుద్దేశించి వైఎస్సార్‌సీపీ నేత దాడి వీరభద్రరావు ఎద్దేవా చేశారు. శుక్రవారం దాడి వీరభద్రరావు విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపులకు పాల్పడి నైతిక విలువలను తుంగలో తొక్కిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనకంటే చిన్నవాడైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చూసి నైతిక విలువలు నేర్చుకోవాలని హితవు పలికారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తే టీడీపీలో ఒక్క చంద్రబాబు నాయుడే మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాన్ని దేశంలోని అన్ని చట్టసభల్లోనూ అమలు చేయాలని కోరారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు నైతిక విలువలు పాటిస్తే గౌరవం దక్కుతుందని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment