బోధన్ ముస్తాబు
Published Fri, Oct 18 2013 2:12 AM | Last Updated on Fri, Sep 1 2017 11:44 PM
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ :జైత్రయాత్ర సభకు జిల్లా నలుమూలల నుంచి 50వేల మందిని తరలించనున్నారు. ఇందుకోసం బస్సులు, లారీలు, డీసీఎంలు, సుమోలు, జీపులు ఇతర వాహనాలను సమకూర్చుతున్నారు. బోధన్ పట్టణం నుంచే 15 వేల మందిని తరలిస్తున్నారు. ఈ మేరకు డ్వాక్రా మహిళల సమీకరణంపై దృష్టి సారిం చినట్టు తెలుస్తోంది. మిగతా నియోజకవర్గాల నుంచి మూడు వేలు మొదలుకుని ఐదు వేల వరకు జనాలను తరలించేందుకు కృషి చేస్తున్నారు. వేదిక అలంకరణపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. కళాకారుల కోసం ప్రత్యేకంగా ఒక వేదికను ఏర్పాటు చేశారు. తెలంగాణ మంత్రులు, ఎంపీలు, సీనియర్ నేతలు హాజరు కానుండటంతో భారీ పోలీసు బందో బస్తును ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బహిరంగసభ జరుగనుంది. కేంద్ర సహాయ మంత్రి బలరాం నాయక్ , ఉప ముఖ్యమంత్రి దామోద ర రాజనర్సింహ, పలువురు టీ మంత్రులు, ఎం పీలు,ఎంఎల్‌ఏలు, ఎంఎల్‌సీలు రానున్నారు.
పెండింగ్ సమస్యలు చర్చకు వచ్చేనా..
తెలంగాణకు తలమానికంగా నిలిచిన నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని బోధన్ ప్రాంతవాసులు కోరుతున్నారు. 2002లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేశారు. ఉపాధి కోల్పోయిన కార్మికులు కొంతమంది ఆత్మహత్య లు చేసుకున్నా పట్టించుకోలేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. తర్వాత కాంగ్రెస్ హయాంలో శాసన సభాసంఘం నిజాంషుగర్స్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సిఫార్సులు చేసినప్పటికీ సీమాంధ్ర పాలకులు పట్టించు కోలేద ని.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ఫ్యాక్టరీని ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నిజాం సాగర్‌కు బ్యా లెన్సింగ్ రిజర్వాయర్‌గా నిర్మించిన సింగూరు విషయంలో తెలంగాణ మంత్రులు ఆలోచిం చాలని రైతులు కోరుతున్నారు.
సాగు.. తాగు నీరు
సింగూరు ప్రాజెక్టు నీటిని నిజామాబాద్, మెదక్ జిల్లాలకే కేటాయించాల్సి ఉన్నప్పటికీ కృష్ణా, గోదావరి బేసిన్ పరిధిలో ఉన్న హైదరాబాద్‌కు తాగునీటి అవసరాల కోసం ఆంధ్ర పాలకులు అప్పట్లో తరలించుకుపోయిన విషయాన్ని గుర్తించాలంటున్నారు. అదేవిధంగా 1960 సంవత్సరంలో రైతుల భాగస్వామ్యంతో సారంగాపూర్ వద్ద ఏర్పాటైన నిజామాబాద్ సహకార చక్కెర కర్మాగారాన్ని పరిరక్షించేం దు కు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జిలా ్లలో మారుమూల ప్రాంతమైన జుక్కల్ నియోజక వర్గంలోని మద్నూరు, బిచ్కుంద మండలా ల పరిధిలో 22 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే మహారాష్ట్ర-ఆంధ్రప్రదేశ్ అంతర్‌రాష్ట్ర ప్రాజెక్టు అయిన లెండి పనులు సత్వరమే పూర్తి చేయాలంటున్నారు. ఆర్మూర్ ప్రాం తంలో పసుపు శుద్ధి కార్మాగారాన్ని ఏర్పాటు చేయాలని, యువతకు ఉపాధి కల్పించేందుకు నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వరకు ఇం డస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. అనేక ఏళ్లుగా జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రధాన సమస్యలపై కాంగ్రెస్ జైత్రయాత్ర సభకు వస్తున్న కాంగ్రెస్ పెద్దలు దృష్టిసారించాలని విపక్షాలతో పాటు తెలంగాణ వాదులు, ప్రజలు కోరుతున్నారు.
Advertisement