జక్కంపూడి సేవలు చిరస్మరణీయం | jakkampudi rammohan rao Services memorable | Sakshi
Sakshi News home page

జక్కంపూడి సేవలు చిరస్మరణీయం

Published Fri, Oct 10 2014 12:44 AM | Last Updated on Tue, May 29 2018 4:15 PM

జక్కంపూడి సేవలు చిరస్మరణీయం - Sakshi

జక్కంపూడి సేవలు చిరస్మరణీయం

బుర్రిలంక (కడియం) :రాష్ట్ర మంత్రిగా, జిల్లాలో కీలకమైన నాయకుడిగా దివంగత జక్కంపూడి రామ్మోహనరావు సేవలు చిరస్మరణీయమని ఆయన మూడో వర్ధంతి సందర్భంగా బుర్రిలంకలో ఘనంగా నివాళులర్పించారు. మండల యూత్ కన్వీనర్ కొత్తపల్లి మూర్తి ఆధ్వర్యంలో భారీ వైద్యశిబిరం, రక్తదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమండ్రి రూరల్ వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ముఖ్య అతిథులుగా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, పార్టీ జిల్లా మాజీ కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి పాల్గొన్నారు. రాజశేఖరరెడ్డి శిష్యునిగా జక్కంపూడి రామ్మోహనరావు తనదైన ముద్రవేశారని జగ్గిరెడ్డి పేర్కొన్నారు.
 
 తాను ఎమ్మెల్యేగా గెలవడానికి జక్కంపూడి చొరవే కారణమని కుడుపూడి గుర్తు చేసుకున్నారు. కడియపులంక సర్పంచ్ వార పాపరాము, కడియం సొసైటీ అధ్యక్షులు గిరజాల బాబు, మాజీ ఎంపీపీ తోరాటి సత్యనారాయణ, రాజమండ్రి నగర పాలక సంస్థ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలరెడ్డి, చెల్లుబోయిన శ్రీను తదితరులు జక్కంపూడి సేవలను కొనియాడారు. రామ్మోహనరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి జక్కంపూడి రాజా, సేవాదళ్ కన్వీనర్ సుంకర చిన్ని, నర్సరీ అసోసియేషన్ అధ్యక్షుడు పుల్ల ఆంజనేయులు, ఐఎన్‌ఏ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు మార్గాని సత్యనారాయణ, కడియపులంక సొసైటీ అధ్యక్షుడు పల్ల సుబ్రహ్మణ్యం, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు డి. వీరభద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
 
 ప్రజల మనిషి జక్కంపూడి
 రాజమండ్రి సిటీ : ప్రజల మనిషి జక్కంపూడి రామ్మోహనరావు అని, అయన  మరణించి మూడేళ్లయినా ఆయన జ్ఞాపకాలు, పేదలకు ఆయన  చేసిన సేవలు అనునిత్యం కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయని వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు పేర్కొన్నారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు తృతీయ వర్ధంతి సందర్భంగా రాజమండ్రి కంబాలచెరువు సమీపంలోని జక్కంపూడి చౌక్ వద్ద ఏర్పాటు చేసిన అన్నసమారాధన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
 
 తొలుత జక్కంపూడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్పొరేషన్ వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిళారెడ్డి, కార్పొరేటర్లు బొంతా శ్రీహరిరావు, మజ్జి నూకరత్నం, మాజీ కార్పొరేటర్లు దంగేటి వీరబాబు, వాకచర్ల కృష్ణ, వైఎస్సార్‌సీపీ నాయకులు సుంకర చిన్ని, మేడపాటి అనిల్‌కుమార్‌రెడ్డి, మాసా రామజోగ్, లంక సత్యనారాయణ, ఆరిఫ్, ఉమామహేశ్వరి, గారా త్రినాథ్  తదితరులు పాల్గొన్నారు.ధీరోదాత్తుడు జక్కంపూడి : జక్కంపూడి రామ్మోహనరావు ధీరోదాత్తుడని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ అధ్యక్షుడు దొండపాటి శంకర్రావు పేర్కొన్నారు.  ట్రస్ట్ కార్యాలయంలో జక్కంపూడి చిత్రపటానికి  పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఛాంబర్ ఆప్‌కామర్స్ అధ్యక్షుడు అశోక్‌కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement