బెదిరింపులకు భయపడం | Jakkampudi Vijaya Lakshmi fire TDP Govt | Sakshi
Sakshi News home page

బెదిరింపులకు భయపడం

Published Sun, Apr 23 2017 3:47 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

బెదిరింపులకు భయపడం - Sakshi

బెదిరింపులకు భయపడం

చంద్రబాబు ప్రభుత్వ తీరుపై జక్కంపూడి ధ్వజం
మధురపూడి (రాజానగరం) : చంద్రబాబు ప్రభుత్వం బెదిరింపులకు వైఎస్సార్‌ సీపీ బెదరదని పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. శనివారం విలేకర్లతో మాట్లాడుతూ, లోకేష్‌ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి గెలవాలని ఆమె సవాల్‌ విసిరారు. అధికార పార్టీ నాయకత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు. సోషల్‌ మీడియా పోస్టింగ్‌ల పేరిట హైదరాబాద్‌లోని కార్యాలయంలోకి పోలీసులు దౌర్జన్యంగా చొరబడడాన్ని జక్కంపూడి తీవ్రంగా వ్యతిరేకించారు.

 పోలీసులు చట్టానికి ప్రతినిధులుగా వ్యవహరించాలన్నారు. వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యక్రమాలతో అధికార పార్టీ నాయకత్వానికి చెమటలు పడుతున్నాయన్నారు. ప్రజాసమస్యలపై వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి నిరంతరం పోరాడుతున్నారన్నారు. రాష్ట్రంలోని సమస్యలపై ప్రజలు సోషల్‌ మీడియా ద్వారా వ్యతిరేకించడంతో బెంబేలెత్తిపోతుందన్నారు. అలాగే సోషల్‌ మీడియాలోనూ వైఎస్సార్‌సీపీకి  ప్రజల ఆదరణ పెరుగుతుండడంతో చంద్రబాబు, లోకేష్‌ తదితరులకు ఏమిచేయాలో అర్థం కాక దౌర్జన్యాలకు దిగారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement